సీఎస్ బదిలీపై ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్

  • Published By: chvmurthy ,Published On : November 4, 2019 / 02:04 PM IST
సీఎస్ బదిలీపై ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్

Updated On : November 4, 2019 / 2:04 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై జగన్ సర్కారు బదిలీవేటు వేయటం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడ్డాయి.  సీఎస్ ను బదిలీ చేయటం పై  విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో స్పందించారు.  

ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్‌ఫర్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ వైఎస్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సీఎంవోలో కీలకంగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు ఇవ్వటం వల్లే బదిలీ వేటు పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఇంకో 5 నెలల సర్వీసు మాత్రమే ఉంది ఈ సమయంలో ఆయన్ను బదిలీ చేయటం కూడా చర్చగా మారింది. టీడీపీ ఎంపీ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.