తెలంగాణ కేబినెట్ సమావేశం..నిర్ణయాలు ఇవే

  • Published By: madhu ,Published On : February 16, 2020 / 06:14 PM IST
తెలంగాణ కేబినెట్ సమావేశం..నిర్ణయాలు ఇవే

Updated On : February 16, 2020 / 6:14 PM IST

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రగతిలో పచ్చదనం, పారిశుధ్యం పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఫిబ్రవరి 28వ తేదీన శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించాలని, రెవెన్యూ చట్టంపై అవగాహన, భూసమస్యలపై దిశా నిర్దేశం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్‌పై చర్చ జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

హెచ్ఎండీఏ పరిధిలో భూముల అమ్మకాలకు లైన్ క్లియర్.
భూముల అమ్మకాల ద్వారా రూ. 10 వేల కోట్లు రాబట్టాలని అంచనా. 
మోకిళ్ల, ప్రతాప సింగారం, కొర్రెములలో ల్యాండ్ పూలింగ్ వెంచర్లు. 

ల్యాండ్ పూలింగ్‌తో శాటిలైట్ టౌన్ షిప్స్.
తెలంగాణ హెల్త్ ప్రోఫైల్‌పై కేబినెట్‌లో చర్చ. 
ఇక రోగులకు వైద్య పరీక్షలు ఉచితం. 

దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ప్రభుత్వ పెన్షన్. 
ఫిబ్రవరి 24 నుంచి 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం. 
పట్టణ ప్రగతి కార్యక్రమ సన్నాహకం కోసం ఈ నెల 18న రాష్ట్ర స్థాయి సదస్సు. సమావేశానికి మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, కమీషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఆహ్వానం. 

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ. 148 కోట్ల చొప్పున నిధులు. 
14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధుల్లో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు రూ. 500 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 311 కోట్లు. 
పట్టణ ప్రగతిలో పచ్చదనం – పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం. 

తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం. 
రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించడం. 

సీఏఏ రద్దు చేయాలని తీర్మానం. 
భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదు. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి. 

Read More : CAAను రద్దు చేయండి : తెలంగాణ కేబినెట్