CM Jagan : వైసీపీ ఎమ్మెల్యేలలో మళ్లీ టెన్షన్.. సెకండ్ లిస్ట్ రెడీ చేసిన సీఎం జగన్..!
రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్లు సమాచారం. సెకండ్ లిస్ట్ పై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు జగన్.

CM Jagan Prepared Second List
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. పార్టీలో మార్పులు, టికెట్ లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై చర్చించారు. రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్లు సమాచారం. సెకండ్ లిస్ట్ పై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు జగన్. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు.
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8గంటల వరకు కొనసాగింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో మార్పుల అంశానికి సంబంధించి జిల్లా వారీగా సీఎం జగన్ సమీక్ష చేశారు. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. కొన్ని చోట్ల కొత్త వారిని తీసుకొచ్చారు. కొంతమందికి స్థానచలనం కలిగించారు జగన్.
Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?
ఇక రెండో లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో జగన్ సమీక్ష చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలు, కృష్టా, గుంటూరులో ఎవరెవరిని మారుస్తున్నారు అనే దానిపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించాక రెండో లిస్టు కూడా ప్రకటించేందుకు వైసీపీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇవాళ రాత్రికి లేదా రేపు(డిసెంబర్ 28) దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?