పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్  

  • Published By: chvmurthy ,Published On : October 20, 2019 / 03:00 PM IST
పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్  

Updated On : October 20, 2019 / 3:00 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ హుజూర్ నగర్ లో ఉండటం పట్ల టీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ ను బయటకు పంపించాలని  కోరుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

కోదాడకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, నిబంధనలకు విరుధ్ధంగా ఆదివారం, అక్టోబరు20న హుజూర్ నగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారని ఆ ఫిర్యాదులో కోరింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికలసంఘం పట్టించు కోవటంలేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో  అక్టోబరు21 సోమవారం ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్  జరుగుతుంది. 24 న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.