Karthigai Deepam : తిరువణ్ణామలై వెళ్లే భక్తులకు శుభవార్త.. అరుణాచలంలో కార్తిగై మహా దీపోత్సవం.. 10వేల ప్రత్యేక బస్సులు, రైళ్లు..!
Karthigai Deepam : చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 1,982 ప్రత్యేక బస్సులు నడపనుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనంగా 8,127 బస్సులు నడపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ పేర్కొంది.

Karthigai Deepam
Karthigai Deepam : కార్తీక మాసం వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరువణ్ణామలై అన్నామలైయర్ దీపం. కార్తిగై దీపం.. తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగలలో ఒకటి. ఎంతో శక్తివంతమైన వేడుక ఇది. 2024లో ఈ పండుగ డిసెంబర్ 13 శుక్రవారం రోజున జరుపుకుంటారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తూ లెక్కలేనన్ని మట్టి దీపాలను వెలిగిస్తారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో కార్తిగై దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
పవిత్రమైన తిరువణ్ణామలైలో జరుపుకునే కార్తిగై దీపోత్సవానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అరుణాచల కొండపై మహా దీపం వెలిగించడం ద్వారా ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏడాదిలో కతిగ దీపాత్రి ఉత్సవాలు డిసెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున అరుణాచలేశ్వర ఆలయంలో వెలిగి సాయంత్రం 6 గంటలకు కొండపై మహా దీపాన్ని వెలిగిస్తారు. ఆ రోజు దాదాపు 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ నెల 12 నుంచే ప్రత్యేక బస్సులు ప్రారంభం :
కార్తిగై దీపం పండుగ, పౌర్ణమి గిరివాళం కోసం తిరువణ్ణామలైకి వచ్చే భక్తుల రద్దీకి దృష్ట్యా రాష్ట్ర రవాణా శాఖ డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 15 వరకు 10వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. దక్షిణ రైల్వే కూడా కాట్పాడి, విల్లుపురం, తాంబరం, తిరుచ్చి నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ సమయంలో చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 1,982 ప్రత్యేక బస్సులు నడపనుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనంగా 8,127 బస్సులు నడపనున్నట్లు పత్రికా ప్రకటన తెలిపింది. ముందస్తు బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది.
తాంబరం-తిరువణ్ణామలై అన్‌రిజర్వ్‌డ్ మెము ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 13, డిసెంబర్ 14, డిసెంబర్ 15 (శుక్రవారం, శనివారాలు, ఆదివారం) ఉదయం 10.45 గంటలకు తాంబరం నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువణ్ణామలై చేరుతుందని రైల్వే పేర్కొంది. తిరుగు ప్రయాణంలో భక్తుల కోసం రైలు తిరువణ్ణామలై నుంచి రాత్రి 10:25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2:15 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
రైళ్లు, బస్సుల రిటర్న్ జర్నీ టైమింగ్స్ :
కాట్పాడి-విల్లుపురం అన్‌రిజర్వ్‌డ్ మెము స్పెషల్ డిసెంబరు 13, 14, 15 తేదీల్లో కాట్పాడిలో ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి, తిరువణ్ణామలై మీదుగా వరుసగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు విల్లుపురం స్టేషన్ నుంచి ఉదయం 11:15 గంటలకు బయల్దేరుతుంది.
అలాగే, రాత్రి 8 గంటలకు మరో రైలు బయలుదేరి తరువాత వరుసగా మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 11:45 గంటలకు కాట్పాడి స్టేషన్‌కు చేరుకుంటాయి. విల్లుపురం-తిరువణ్ణామలై మెము ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 13, 14, 15 తేదీలలో విల్లుపురం నుంచి ఉదయం 9:25, సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి, తిరువణ్ణామలైకి వరుసగా ఉదయం 11:10, సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో, రైలు తిరువణ్ణామలై నుంచి మధ్యాహ్నం 12.40 గంటలు, 3 గంటలకు బయలుదేరి అదే రోజు వరుసగా మధ్యాహ్నం 2:15, సాయంత్రం 4:20 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుచ్చిరాపల్లి-వెల్లూర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు డిసెంబర్ 13వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుచ్చి నుంచి బయలుదేరి తిరువణ్ణామలై మీదుగా వెల్లూరు కంటోన్మెంట్‌కు మధ్యాహ్నం 2.50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వెల్లూరు కంటోన్మెంట్ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు తిరుచ్చి చేరుకుంటుంది.
Read Also : Mohan Babu : ఆస్పత్రి నుంచి సినీ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్.. వారం రోజులు రెస్ట్..