Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు

శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. అటువంటి శ్రావణమాసం ఈ ఏడాది మరో శ్రావణంతో వచ్చింది. అంటే అధిక శ్రావణమాసం అన్నమాట.మరి ఈ అధిక శ్రావణ మాసంలో ఏఏ పనులు చేయకూడదంటే..

Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు

Adhika Sravan Masam 2023

Adhika Shravana Masam 2023 : శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. ఆషాఢ మాసం వెళ్లాక వచ్చే శ్రావణమాసంలో ఇళ్లన్నీ ఆధ్యాత్మికతో నిండిపోతాయి. పచ్చని మామిడి తోరణాలు, పసుపు రాసిన గడపలు.. పూజలు పునస్కారాలతో మహిళలు బిజీ బిజీగా ఉంటారు. అటువంటి శ్రావణమాసం ఈ ఏడాది మరో శ్రావణంతో వచ్చింది. అంటే అధిక శ్రావణమాసం అన్నమాట. సాధారణంగా ఇంగ్లీషులో అయినా తెలుగు అయినా నెలలు 12 ఉంటాయి. కానీ 2023లో అధిక శ్రావణమాసంతో కలిపి ఈ ఏడాది 13 నెలలు వచ్చాయి.

2023లో వచ్చిన 13 నెలలు..
ఇంగ్లీషు నెలలు ఎప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడు 12 ఉంటాయి. కానీ తెలుగు నెలలు అలా కాదు ప్రతీ మూడేళ్లకు ఒకసారి అధిక మాసాలు వస్తాయి. అలా ఈ ఏడాది (2023) అధిక శ్రావణ మాసాలు వచ్చాయి. అలా మొత్తం తెలుగు నెలలు 13గా ఉన్నాయి. ఇలా ప్రతీ మూడేళ్లకు ఒక మాసం అధికంగా వచ్చినప్పుడు 13 నెలలు వస్తుంటాయి. అది హిందూ సంప్రదాయంలోనే ప్రత్యేక అని చెప్పకనే చెప్పాలి. సాధారణంగా ఆషాఢ మాసం అధిక మాసాలుగా రావటం జరుగుతుంటుంది. కానీ ఈఏడాది మాత్రం అధిక శ్రావణం రావటం గమనించాల్సిన విషయం.

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

19 ఏళ్లకు వచ్చిన అధిక శ్రావణం..
పండుతులు చెప్పినదానికి బట్టి.. శ్రావణ మాసం 19 ఏళ్లకు ఒకసారి వస్తుంది. దీనినే అధిక శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం.. (ఇంగ్లీషుల నెలల ప్రకారంగా చూస్తే) శ్రావణమాసం ‘జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది. ఈ అదే ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణం ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ మాసంలో శివయ్యకు పూజలు చేస్తే మంచి శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడేళ్ల తరువాత అదనపు నెల వస్తుంది. దీనినే అధికమాసం లేదా శూన్య మాసం అని కూడా అంటారు.

సౌరమానం.. చంద్రమానంలో తేడాలు..
ఇలా రావటానికి కారణం క్యాలెండర్ లెక్కింపులో తేడాలేనంటారు నిపుణులు. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే ఏడాదికి 365 రోజుల 6 గంటలు ఉంటాయి. అదే చంద్రమానం ప్రకారం 354 రోజులే ఉంటాయి. అంటే దాదాపు 11 రోజుల గ్యాప్ ఉంది. ఏడాది లెక్కింపులో ఉండే తేడాలను సరిచేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెల అదనంగా వచ్చే మాసాన్ని ఇలా తెలుగు నానుడి, హిందూ క్యాలెండర్ ప్రకారం అధిక మాసం రూపంలో వస్తుందంటారు. దీనినే ఇంగ్లీషులో అయితే లీఫ్ ఇయర్ అంటారు.

అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకూ అధిక శ్రావణ మాసం అని చెప్పుకున్నాం కదా.. ఆ రోజుల్లో చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం..

-వివాహాలు చేసుకోకూడదు..
వివాహ ప్రతీ మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. అటువంటి వివాహాలను ఈ అధిక శ్రావణంలో చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.

-కొత్త షాపుల ప్రారంభోత్సవాల చేయకూడదు.
జీవితంలో పైకి రావటానికి వ్యాపారాలు చేస్తుంటారు. అటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు అధిక మాసంలో చేయకూడదు.

-కొత్త ప్రాజెక్ట్‌లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరడం, భారీ పెట్టుబడులను పెట్టడం చేయొద్దు..

-కొత్త ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు అంటూ భూమి పూజలు చేయవద్దు.

– ఆస్తుల కొనుగోళ్లు చేయవద్దు..

-ఉపనయనం వంటి శుభ కార్యాలు చేయవద్దు..