Bhadradri : భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు…వరహావతారంలో శ్రీరాముడు

గురువారం నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. జనవరి 07వ తేదీన వామనావతారం, 8న పరుశురామావతారం, 9వ తేదీన శ్రీరామవతారం...

Bhadradri : భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు…వరహావతారంలో శ్రీరాముడు

Bhadradri (2)

Updated On : January 22, 2022 / 12:42 PM IST

Adhyayanotsavam : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2022, జనవరి 05వ తేదీ బుధవారం వరహావతారంలో శ్రీరాముడు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read More : Telangana : ఎన్నికలకు ముందే.. హీట్ ఎక్కిన తెలంగాణ రాజకీయం!

ఇదిలా ఉంటే…2022, జనవరి 06వ తేదీ గురువారం నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. జనవరి 07వ తేదీన వామనావతారం, 8న పరుశురామావతారం, 9వ తేదీన శ్రీరామవతారం, 10న బలరామావతారం, 11న శ్రీ కృష్ణావతారంలో స్వామి వారు దర్శనమివ్వనున్నారు. 12వ తేదీన గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Read More : Hyderabad RSS : హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు

13వ తేదీన శ్రీరామచంద్రుడు ఉత్తర ద్వార దర్శనమిస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా…ఈనెల 13వ తేదీ వరకు నిత్య కళ్యాణాలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పలు నిబంధనలు, ఆంక్షలు విధించారు. సేవలు, ఊరేగింపులు రద్దు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా…భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.