భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 14న నవమి రోజున సీతారాముల కల్యాణం, 15న మహ పట్టాభిషేకం జరగనుంది.
సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుకు సంబంధించి రూ.85 లక్షలలో పలు పనులు చేపట్టారు. బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తలంబ్రాలు, ప్రసాదాలు, గోదావరి స్నాన ఘట్టాల వద్ద భద్రత, పోలీసు బందోబస్తు, తాగునీటి, వసతి సదుపాయం లాంటి అంశాలపై అధికారులు దృష్టిసారించారు.
* ఏప్రిల్ 6 నుంచి 20 వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
– ఏప్రిల్ 6న వికారి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నూతన పంచాంగ శ్రవణం, ఆస్థానం, తిరువీధి సేవలు నిర్వహిస్తారు.
– ఏప్రిల్ 10న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం, మండప వాస్తు హోమం.
– ఏప్రిల్ 11న గరుడ పట లేఖణం, గరుట పట అదివాసం, – 12న అగ్ని ముఖం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, దేవతావాహణం.
– 13న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ.
– 14న శ్రీసీతారాముల కల్యాణం, 15న మహాపట్టాభిషేకం, 16న సదస్యం.
– 20న ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.