Statue of equality : సహస్రాబ్ది ఉత్సవాల్లో నేటి కార్యక్రమాలు.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాక
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.

Rajnath
Muchintal : యజ్ఞాలు, అష్టాక్షరీ మంత్ర పఠనాలు.. చతుర్వేద పారాయణాలతో .. నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా సమతామూర్తి వెయ్యేళ్ల పండుగ జరుగుతోంది. 9వ రోజు గురువారం అష్టాక్షరీ మహా మంత్ర అనుష్టాన కార్యక్రమం, ఆరాధన భగవత్ సన్నిధానంలో కొనసాగింది. వేద, పురాణాది గ్రంథాల యొక్క పారాయణ ప్రారంభ శ్లోకాలను, మంత్రాలను విన్నవించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞం జరుగనుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు 108 దివ్య దేశాల్లోని 20 దేవాలయాల్లో ప్రాణప్రతిష్టతో పాటు కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ చేయనున్నారు.
Read More : Tata Nexon EV: వావ్! ఈ SUVకారులో రూ. 580కే 1000కి.మీలు ప్రయాణించొచ్చు
ఉదయం 10 గంటలకు వైయూహిక ఇష్టి.. ఉదయం 10 గంటలకి నారసింహ ఇష్టి వేద పండితులు నిర్వహించనున్నారు. ఉదయం 10.30కి ప్రవచన మండపంలో శ్రీ రామానుజ పూజ, మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులు ప్రవచనాలు చేయనున్నారు. అనంతరం కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం.. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరుగనుంది.
Read More : Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్
ఇక ఈ రోజు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. బుధవారం శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో .. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు హాజరయ్యారు.