Dhanteras 2025: ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువులు కొనొద్దు.. కొన్నారనుకో..

దీపావళి అంటేనే దీపాల పండుగ అని అర్థం. పండుగ దగ్గర పడటంతో ప్రజలు తమ ఇళ్లను, కార్యాలయాలను లైట్లు, పూలు, రంగురంగుల రంగోలిలతో అలంకరిస్తారు.

Dhanteras 2025: ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువులు కొనొద్దు.. కొన్నారనుకో..

Updated On : October 17, 2025 / 6:27 PM IST

Dhanteras 2025: ధన్ తేరాస్.. హిందువులు ఎంతో ఉత్సాహంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది. ధన త్రయోదశి అని కూడా పిలువబడే ఈ పండుగ ఈ ఏడాది అనగా 2025లో అక్టోబర్ 18, 19 తేదీలలో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రజలు కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్షీదేవి కటాక్షం తమపై ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా వెండి, బంగారం కొంటే మంచి జరుగుతుందని ఎక్కువగా నమ్ముతారు. అందుకే, ధన త్రయోదశి రోజున బంగారం, వెండి అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.

దీపావళి అంటేనే దీపాల పండుగ అని అర్థం. పండుగ దగ్గర పడటంతో ప్రజలు తమ ఇళ్లను, కార్యాలయాలను లైట్లు, పూలు, రంగురంగుల రంగోలిలతో అలంకరిస్తారు. ధంతేరాస్ నుండి భయా దూజ్ వరకు పండుగను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

ధంతేరాస్ దీపావళి ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాదు శ్రేయస్సు, సంపద, అదృష్టంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక రోజున ప్రజలు షాపింగ్ చేయడంలో మునిగిపోతారు. ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే, ధన త్రయోదశి పర్వదినాన ఏది పడితే అది కొనుగోలు చేయడానికి వీల్లేదని పండితులు చెబుతున్నారు. అసలు ఈరోజున ఏం కొనాలి? ఏం కొనకూడదు? తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. ధన్ తేరస్ సమయంలో అనుసరించాల్సిన, నివారించాల్సిన విషయాలు తెలుసుకుందాం.

ధన్‌తేరాస్ రోజున కొనకూడని వస్తువులు:

ఐరన్, స్టీల్ : ఇనుము, ఉక్కు.. ఈ లోహాలు శని దేవుడికి సంబంధించినవి. శని దేవుడు సవాళ్లు, కష్టాలను తెస్తాడని నమ్ముతారు. ధంతేరాస్ నాడు కొనుగోలు చేయడానికి ఇవి అశుభకరమని నమ్ముతారు. అల్యూమినియం కూడా దురదృష్టకరమని భావిస్తారు.

పదునైన వస్తువులు: కత్తులు, కత్తెరలు, సూదులు, బ్లేడ్ లను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే అవి అదృష్టాన్ని “కత్తిరిస్తాయి” అని భావిస్తారు.

గాజు వస్తువులు: గాజు వస్తువులు రాహువుతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ప్రజలపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని నమ్ముతారు.

నలుపు రంగు వస్తువులు: నలుపు సాంప్రదాయకంగా ప్రతికూలత, దుఃఖం, దురదృష్టంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున నల్ల వస్తువులను కొనడం మంచిది కాదు.

నూనె, నెయ్యి: ఈ వస్తువులు శని దేవుడికి సంబంధించినవి. ధంతేరాస్ నాడు కొనుగోలు చేయడానికి అశుభకరమైనవిగా భావిస్తారు.

Also Read: కార్తీక మాసంలో స్నానం ఇలా చేస్తే.. రాజయోగమే..!