Fake Voter ID Cards: సమంత, తమన్నా, రకుల్ పేర్లతో ఓటర్ స్లిప్ లు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ కలకలం.. అధికారులు సీరియస్..
ఎవరైనా ఇటువంటి తప్పుడు విషయాలను సర్కులేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Fake Voter ID Cards: జూబ్లీహిల్స్ ఫేక్ ఓటర్ లిస్ట్ పై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. సినీ నటులు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంతల పేరుతో ఓటర్ స్లిప్ లు సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారులు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి తెలిపారు. హీరోయిన్ల పేర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
”సినీ నటుల పేర్లతో ఓటర్ స్లిప్పులు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము సంబంధిత ఏఆర్ఓతో విచారణ జరిపించాం. అది ఫేక్ అని తెలుసుకున్నాం. ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని క్రియేట్ చేసినట్లు తెలుసుకున్నాం. వెంటనే మధురానగర్ పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశాం. మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశాం. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతామన్నారు. ఎవరైనా ఇటువంటి తప్పుడు విషయాలను సర్కులేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరూ కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ లు సర్కులేట్ చేయొద్దు. ప్రజలు కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ లు నమ్మొద్దు” అని ఎన్నికల అధికారి తెలిపారు.
”ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా భాటియా పేర్లు, ఫోటోలు, చిరునామాలతో కూడిన మూడు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూడు కార్డుల్లో ఒకే చిరునామా “8-2-120/110/4″ ఉంది. అవి నకిలీవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లోని యూసుఫ్‌గూడ సర్కిల్-19 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు” అని అధికారులు తెలిపారు.
Also Read: రసవత్తరంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం.. ప్రచారంలోకి ఆ ముగ్గురు బిగ్ పొలిటికల్ స్టార్లు..!