Diwali 2025 : మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోవాలంటే దీపావళికి ముందు ఇలా చేయండి…

Diwali 2025 దీపావళి పండుగకు ముందు మీ ఇంట్లోని చెడును, ప్రతికూల శక్తిని తొలగించేందుకు కొన్నిరకాల వస్తువులను ఇంటి నుంచి తొలగిస్తే మేలు.

Diwali 2025 : మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోవాలంటే దీపావళికి ముందు ఇలా చేయండి…

Diwali Vastu Tips

Updated On : October 13, 2025 / 7:11 AM IST

Diwali 2025 : దీపావళి ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి. దేశమంతటా ఆనందంగా, ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇళ్లను దీపాల అలంకరణతో నింపేస్తారు. సాధారణంగా ఈ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం దీపావళి పండుగ అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21 సాయంత్రం 4.05 గంటలకు ముగుస్తుంది. సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20నే ఉంటుంది కాబట్టి దీపావళిని ఆ రోజునే జరుపుకోవాలి. దీపావళి ఐదు రోజుల పండుగ. ధన్‌ తేరస్, నరక చతుర్దశి (చిన్న దీపావళి), దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్. ప్రతిరోజుకీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే తెలుగు ప్రజలు ఎంతో శుభప్రదమైన పండుగగా భావిస్తారు. ఇంట్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగగా భావిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు ముందు ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు.

Also Read: Dhanteras 2025 : ధన్ తేరస్ తర్వాత ఈ 6 రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

దీపావళి పండుగకు కొద్ది రోజులే మిగిలి ఉంది. చాలామంది ఇంటిని శుభ్రపరిచే పని ప్రారంభిస్తారు. సానుకూల శక్తి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొరకు ఇంట్లోకి అనేక కొత్త వస్తువులను తీసుకొస్తారు. అయితే, దీనితోపాటు ఇంటి నుండి కొన్ని వస్తువులను తొలగించడం కూడా అవసరం. మీరు మీ ఇంటి నుండి ప్రతికూలతను దూరంగా ఉంచాలంటే.. లక్ష్మీ దేవిని మీ ఇంట్లోనే సజీవంగా ఉంచాలనుకుంటే.. లేదా లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి రావాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కొన్నిరకాల వస్తువులను ఇంటి నుంచి తొలగిస్తే మేలు.

దీపావళి ముందు ఈ వస్తువులను మీ ఇంట్లో నుంచి తొలగించండ.. 

♦ విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచకండి. ఉదాహరణకు.. విరిగిన పాత్రలు, ఫర్నీచర్, అద్దాలు, గాజులు ఇలా ఏదైనా విరిగిపోయిన వస్తువులను సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం.. విరిగిన వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ముదూళి, చెత్త నిల్వలు ఇలాంటి వాటిని దీపావళికి ముందు తొలగించుకుంటే మంచిది. పండుగ ముందు ఇలాచేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.. బయటకు నుంచి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రక్రియ ఇంట్లోని వారి ఆరోగ్యానికి కూడా మంచిదే.

♦ పాత బడిన, చిరిగిపోయిన, చాలాకాలంగా ఇంట్లో పడిఉన్న దుస్తులను పండుగ ముందు బయటకు పంపించడం మంచిది. పాత బట్టలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. దీపావళి సమయంలో కొత్త బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కొత్త ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది.

♦ పనికిరాని కాగితం, పత్రాలను కూడా దీపావళి పండుగకు ముందు మీ ఇంట్లో నుంచి తీసేయడం మంచిది. ఇంట్లో అవసరం లేని పత్రాలు, పాత పుస్తకాలు, మ్యాగజైన్లను తీసేయడం. కాగితాల కుప్పలు, అస్తవ్యస్తతకు, మానసిక ఒత్తిడికి చిహ్నంగా పరిగణించబడుతాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని ఆపుతుంది. పాత కాగితం దుమ్ము, సూక్ష్మక్రిములను ఆకర్షిస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు కూడా కారణం అవుతుంది.

♦ పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ దీపావళికి ముందు ఈ ఇంట్లో నుంచి తొలగించేయడం మంచిది. వాస్తు ప్రకారం.. పాడైపోయిన టీవీ, మొబైల్, ఛార్జర్ , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రతికూల శక్తిని పెంచుతాయి. పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ఇది ఇంట్లో అశాంతికి కారణం కూడా అవుతుంది.

♦ ఎండిన పూల దండలు, వాడిపోయిన మొక్కలు లేదా పాత కృత్రిమ పువ్వులు నిర్జీవ శక్తికి చిహ్నాలుగా పరిగణించబడతాయి. అవి ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయి. దీపావళి సందర్భంగా తాజా, ఉత్సాహభరితమైన వస్తువులను స్వాగతించాలి.

♦ గడువు ముగిసిన మందులు, పాత మేకప్ ఉత్పత్తులు లేదా పనికిరాని సౌందర్య సాధనాలను ఇంట్లో ఉంచడం వాస్తు ప్రకారం అశుభం. ఎందుకంటే ఇది నిలిచిపోయిన అభివృద్ధికి ప్రతీక. గడువు ముగిసిన మందులు, సౌందర్య సాధనాలు చర్మానికి లేదా ఆరోగ్యానికి ప్రత్యక్ష హాని కలిగిస్తాయి.

♦ హిందూ విశ్వాసాల ప్రకారం, విరిగిన విగ్రహాలు, చిరిగిన మతపరమైన చిత్రాలు లేదా పాత పూజా సామగ్రిని ఇంట్లో ఉంచుకోవడం అశుభం. ఇది దేవుళ్లను, దేవతలను అవమానించినట్లు పరిగణించబడుతుంది. ప్రతికూలతను తెస్తుంది. విరిగిన విగ్రహాలను పవిత్ర నదిలో నిమజ్జనం చేసి పూజ స్థలాన్ని శుభ్రంగా ఉంచండి.

♦ వాస్తు శాస్త్రం ప్రకారం, పాత బూట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. పాత బూట్లలో బ్యాక్టీరియా, ధూళి పేరుకుపోతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఈ దీపావళికి పాత బూట్లను దానం చేయండి లేదా నాశనం చేయండి.