దీపావళి : తప్పకుండా పాటించవలసిన నియమాలు

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 05:49 AM IST
దీపావళి : తప్పకుండా పాటించవలసిన నియమాలు

Updated On : October 23, 2019 / 5:49 AM IST

దీపావళి పండుగల అంటే శ్రీమహావిష్టువు అవతారం అయిన శ్రీకృష్టుడి భార్య సత్యభామ నరకాసరుడ్ని వధించి ప్రజలకు మేలు చేసిన రోజు. నరకుడు బాధల నుంచి ప్రజలను కాపాడిన రోజు. కష్టాలపై విజయం సాధించి సంతోషాలు నెలకొన్న రోజు కాబట్టి సంతోషాలకు నిదర్శనమైన దీపాలను వెలిగించుకుని  దీపావళి పండుగ జరుపుకుంటున్న రోజు.

దీపావళి నాటి దీప కాంతులు సహస్ర సూర్య కాంతులకు మించినదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవు నెయ్యితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేస్తే సంప్రదాయంగానూ..ఆరోగ్య పరంగానూ చాలా మంచిది. ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే దీపావళి పండుగ దేవత అయిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. 

దీపావళి పండుగ రోజున ఉదయం వెలిగించే దీపం భగవంతని కృతజ్నతలు తెలిపే దీపం అయినీ. సంధ్యాసయమంలో మట్టి ప్రమిదలలో వెలిగించే దీపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు..వేదాలు చెబుతున్నాయి. 

ఉదయం వెలిగించే దీపం దేవుడి దగ్గర, సంధ్యా సమయంలో వెలిగించే దీపం ఇంటి ప్రధానం ద్వారం అయిన గుమ్మం పక్కన వెలగించి భక్తి శ్రద్ధలతో దీపానికి నమస్కరించాలి. అలా చేస్తే దీపం రూపంలో కొలువైన లక్ష్మీదేవి కరుణిస్తుంది. కోరిన వరాలు ఇస్తుంది.   అలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. 

శ్రీ మహా విష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజునీ ప్రజలంతా ఆనందంతో దీపాలు వెలిగించుకుని పండుగ జరుపుకుంటారనీ పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శ్రీరాముడు రావణుడ్ని సంహరించి సీతతో పాటు అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు కూడా దీపావళినాడే. రాముడు అడవులకు వెళ్లిన తరువాత శోకంలో మునిగిపోయిన అయోధ్యవాసులు రాముడి రాక పట్టాభిషిక్తుడు అయిన శుభసమయాన దీపాలు వెలిగించుకుని పండుగ చేసుకున్నారు. ఇలా పురాణాలలో దీపావళికి ఎన్నో కథనాలు ఉన్నాయి.