Holi 2024: హోలీని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

పండుగ ఒక్కటే అయినా దేశంలో హోలీ పండుగను పలు రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో..

Holi 2024: హోలీని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Holi 2024

రంగులు చల్లుకుంటూ జరుపుకునే హోలీ పండుగ అంటే అందరికీ ఇష్టమే. పండుగ ఒక్కటే అయినా దేశంలో హోలీ పండుగను పలు రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దానికి వేరే పేర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హోలీగా ఈ పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్ లో హోలీ రంగుల సందడి మూములుగా ఉండదు.

పంజాబ్ లో హోలీని సిక్కులు హోలా మోహల్లా పేరుతో జరుపుకుంటారు. ఇది పెద్ద పండుగ. ఆనంద్‌ పూర్ సాహిబ్ లో హోలీ వేడుక చూసి తీరాల్సిందే అనేలా ఉంటుంది. ఈ పండుగను జరుపుకోవడానికి విదేశాల్లో స్థిరపడ్డ పంజాబ్ ప్రజలు కూడా వస్తారు. ఇక ఉత్తర ప్రదేశ్ లోని బర్సానాలో రాధా రాణి ఆలయంలో లాత్మార్ హోలీగా నిర్వహిస్తారు. ఇందులో వేలాది మంది పాల్గొంటారు.

పురుషులను స్త్రీలు కర్రలతో కొడతారు. పలు ప్రాంతాల్లో ప్రజలంతా ఒక్క చోట చేరి హోలీ జరుపుకుంటారు. మథురలోనూ హోలీని ఘనంగా జరుపుకుంటారు. బృందావన్ లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ హోలీ పండుగను రాజస్థాన్ హోలీని పుష్కర్ గా జరుపుకుంటారు. బీహార్‌ లో హోలీని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. పలు ప్రాంతాల్లో బురదనూ చల్లుకుంటూ ఆడతారు.

బెంగాల్ లో డోల్ పూర్ణిమ నిర్వహిస్తారు. కుంకుమ పువ్వు కలర్ లో ఉండే దుస్తులను పిల్లలు ధరిస్తారు. ఎక్‌ తార శంటి వాటికి నృత్యం చేసే సంప్రదాయం ఉంది. ఈ పండుగను అక్కడ డోల్ జాత్ర అని కూడా పిలుస్తారు. ఈ పండుగరోజున శ్రీ కృష్ణుడిని, అగ్నిదేవుడిని కొలుస్తారు.

ఒడిశాలో ఈ పండుగ రోజున పూరీ జగన్నాథ్ విగ్రహాలను ఆరాధిస్తారు. గుజరాత్ లో మంటల చుట్టూ ప్రజలు నాట్యము చేస్తారు. మణిపూర్‌ లో హోలీని 6 రోజుల పండుగగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున నృత్యాలు, జానపద పాటలతో డోలు వాయించే సంప్రదాయం ఉంది. కేరళలోని కొచ్చిలో కొంకణి మాట్లాడే గౌడ్ సరావత్ బ్రాహ్మణులు హోలీని ప్రత్యేక వేడుకగా జరుపుకుంటారు. మన దేశంలోనూ కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా పలు దేశాల్లో హిందువులు హోలీని ఘనంగా జరుపుకుంటారు.

Also Read: ఈ పాటలు విననిదే హోలీ జరుపుకోం.. వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం