Chandi Pradakshina : శివాలయంలో చండీ ప్రదక్షిణ ఏలా చేయాలో తెలుసా?..

శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రధమగణాలు కొలువై ఉంటారు. ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగా పురాణంలో పేర్కొనబడింది.

Chandi Pradakshina : శివాలయంలో చండీ ప్రదక్షిణ ఏలా చేయాలో తెలుసా?..

Shivalayam Pradikashna

Updated On : October 19, 2021 / 4:15 PM IST

Chandi Pradakshina : శివాలయంలో ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుని గుడికి వెళ్లే చాలా ముందుకు ప్రదక్షిణతో మొదలు పెడతారు. అయితే ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంటారు. ఇతర దేవతల ఆలయాల్లో చేసిన విధంగానే గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే శివాలయంలో మాత్రం ఇతర దేవతా ఆలయాల్లో చేసిన విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు.

శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ లేదా సోమ సూత్ర ప్రదిక్షణ అంటారు. ఈ ప్రదక్షిణ విషయాన్ని లింగ పురాణంలో వివరించారు. ఈ ప్రదక్షిణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా పురాణాల్లో విశదీకరించారు. శివాలయంలో ప్రదక్షిణ విషయానికి వస్తే ధజస్తంభం వద్ద ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం వరకు అంటే చండీశ్వరుని వరకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ చేసినట్లవుతుంది.

ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ మొదలు పెట్టి శివుడిని అభిషేకించిన జలం బయటకు వెళ్ళే స్ధలం వరకు అన్నమాట. అక్కడే చండీశ్వరుడు కొలువై ఉంటాడు. ఆయన వరకు వెళ్ళి తిరిగి ద్వజస్థంభం వరకు చేరుకోవాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. ఈ విధం చేసే ప్రదక్షిణను చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణమని అని పిలుస్తారు.

శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రధమగణాలు కొలువై ఉంటారు.  ఇలా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగా పురాణంలో పేర్కొనబడింది.

ప్రదక్షిణం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి.

యానికాని చపాపాని జన్మాంతరకృతానిచ..
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే..
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ;
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల..
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర… అంటూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనస్సులో అనుకోవాలి.

శివాలయంలో పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నందికి శివునికి మధ్యలో నడవకూడదు. నంది చూపులు నిరంతరం శివుని మీదే ఉంటాయి.ఇదేవిధంగా శివాలయంలో చాలా మంది భక్తులు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తుంటారు. అలా చేయకూడదు. విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా ఏ దేవత దర్శనం చేయకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి.