Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి. 

Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు

Indrakiladri Hanuman Jayanti

Updated On : May 25, 2022 / 6:03 PM IST

Vijayawada :  హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి.  ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బంది  హనుమజ్జయంతిని  అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టుకు ఎదురుగా రావిచెట్టు క్రింద వెలసియున్న ఆంజనేయస్వామి వారికి మరియు ఘాట్ రోడ్డు ప్రవేశం ( టోల్ గేటు) వద్ద ఉన్న ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం మాన్యుసూక్త విధానముగా “పంచామృత అభిషేకం” మరియు “ఆకు పూజ” వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 04 గంటల నుండి 07 గంటల వరకు మంటపారాధన, హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ నిర్వహించనున్నారు.

Also Read : Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు