MLA Roja : ఈ జన్మకిది చాలు.. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

భగవత్ రామానుజల వారి విగ్రహం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందన్నారు. ఒకేచోట 108 దివ్య దేవాలయాల నిర్మాణం, ఒకే చోట దర్శనం నిజంగా అదృష్టమే అన్నారు.

MLA Roja : ఈ జన్మకిది చాలు.. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

Mla Roja

Updated On : February 3, 2022 / 9:30 PM IST

MLA Roja : సమతామూర్తి భగవత్ రామానుజాచార్యుల విగ్రహం దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు చేయడం చాలా సాహసం అన్న రోజా.. ఇది ఎవరూ చేయలేరని అన్నారు. మన ఇళ్లలో ఒక్క యాగం చేయడమే గగనం అలాంటిది ఇక్కడ 1035 హోమ గుండాలతో హోమం చేయడం చాలా గొప్ప కార్యం అన్నారు. ఇందులో పాల్గొంటున్న వారు అదృష్టవంతులు అని చెప్పారు.

భగవత్ రామానుజల వారి విగ్రహం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందన్నారు. ఒకేచోట 108 దివ్య దేవాలయాల నిర్మాణం, వాటిని ఒకే చోట దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టమే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆమె దర్శించుకున్నారు.

WhatsApp New Update : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. 2 రోజులకు పొడిగించే అవకాశం!

భగవత్ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మహాక్రతువులో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మి నారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. ఇందుకోసం యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రాన్ని తయారు చేశారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలను రాపిడి చేసి బాలాగ్నిని రగిలించారు. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాలకు తీసుకెళ్లారు. యాగశాలను 114 శాలలుగా విభజించి హోమాలను చేశారు. శ్రీరామనగరంలో నేలపై 5 వేల మంది రుత్విజులు యాగం చేయడం ఇదే తొలిసారని వేద పండితులు చెబుతున్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అయోధ్య, నేపాల్, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జీయర్ స్వాములు హాజరై శ్రీలక్ష్మినారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. యాగశాలకు కుడివైపు భాగాన్ని శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా భోగ మండపం, మధ్య భాగాన్ని తిరుమల క్షేత్రానికి గుర్తుగా పుష్ప మండపం, వెనుక వైపు ఉన్న భాగాన్ని కాంచిపురానికి గుర్తుగా త్యాగ మండపం, ఎడమ వైపు ఉన్న మండపాన్ని మేలుకోట కేత్రంగా భావిస్తూ జ్ఞాన మండపంగా నామకరణం చేశామన్నారు చిన్నజీయర్ స్వామి.

Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి

ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భం.. మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టం శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవం. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఆ చారిత్రక ఘట్టానికి ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం వేదికైంది.

విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.. వ్యక్తికన్నా సమాజశ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాది.. భగవదారాధనకు కులమతాలు ప్రాతిపదిక కాదన్న సమతామూర్తి.. రామానుజాచార్యులు. వెయ్యేళ్లక్రితం ఈ భూమి మీద నడిచిన ఆ మహానుభావుడి విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటుచేసిందే సమతా విగ్రహం. అఖండ భారతావనిలో నిర్మితమైన పురాతన ఆలయాలకు, వాటిలో ప్రత్యేకతను చాటే లెక్కకు మిక్కిలి శిల్పాలకు ప్రధాన స్థపతి నేతృత్వంలో ముగ్గురు స్థపతులు ముచ్చింతల్​లో ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

సమతాస్ఫూర్తి కేంద్ర ఏర్పాటు ఆలోచన 2013లో అంకురించగా, 2014 మే నెలలో బీజం పడింది. 250 కిలోమీటర్ల గాలి వేగాన్ని తట్టుకునేలా త్రిదండం, మూర్తి నమూనాను రూపొందించారు. నిర్మాణం భూకంపాలనూ తట్టుకుని నిలుస్తుంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 9 నమోదైనా చెక్కు చెదరదు. భద్రవేది సహా విగ్రహం ఎత్తు 216 అడుగులు. శ్రీరామానుజుల మూర్తి ఎత్తు 108 అడుగులు. త్రిదండం ఎత్తే: 153 అడుగులు.