State Equality : చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక కార్యక్రమం.. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణం

రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ

State Equality : చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక కార్యక్రమం.. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణం

Yagam

Updated On : February 3, 2022 / 11:03 AM IST

Sri Ramanujacharya Statue : శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం రెండో రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజులు ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. శ్రీ ఆఖరి రోజైన 14వ తేదిన.. మహా పూర్ణాహుతి ఉంటుంది. 108 దివ్యదేశాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత.. ఈ యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు. వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు. ఈ కార్యక్రమంతో.. కుంభ ప్రోక్షణ పూర్తై.. ఆ రోజు నుంచి ఆలయాలన్నీ.. ప్రాణ ప్రతిష్ఠ అవుతాయి. దాంతో.. ఈ మహాత్కార్యం పరిసమాప్తమవుతుంది.

Read More : Ode To Equality : శోభాయమానంగా సమతాస్ఫూర్తి.. 2 లక్షల కిలోల నెయ్యి, హోమకుండాల విశిష్టత

సహస్ర కుండాత్మక మహా విష్ణు యాగం ముగిశాక.. మరో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించనున్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. శాంతి కల్యాణం పేరుతో జరగబోయే.. గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం.. భగవద్రామానుజుల వెయ్యేళ్ల పండుగలో మరో కీలక ఘట్టం. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు.
చరిత్రలో నిలిచిపోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో.. రామానుజాచార్యుల బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read More : Ode To Equality : పులకిస్తున్న ముచ్చింతల్.. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 144 యాగశాలలు, 10 వందల 35 హోమకుండాలు

రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. యాగశాలలో వేదపారాయణ మధ్య సహస్రాబ్దీ వేడుకలకు అంకురార్పణ చేశారు. ప్రధాన యాగశాలలో రుత్విక్వరణం, యజమానులకు కంకణధారణ జరిగింది. అనంతరం దీక్ష చేపట్టి యాగదీక్ష స్వీకరించారు. బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చిన్న జీయర్ స్వామివారి శిష్యబృందం ఆధ్వర్యంలో జీవ ప్రాంగణం నుంచి పవిత్ర యాగశాల వరకు సాంస్కృతిక శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.