పూరీ జగన్నాథా..!నీ ఆభరణాలు ఎంతో బాగున్నాయి స్వామీ..చూసేకొద్దీ చూడాలనిపిస్తోందయ్యా..!!

పూరీ జగన్నాథా..!నీ ఆభరణాలు ఎంతో బాగున్నాయి స్వామీ..చూసేకొద్దీ చూడాలనిపిస్తోందయ్యా..!!

Updated On : February 17, 2021 / 12:03 PM IST

Puri Jagannath Devotee 4 KG gold Ornaments  gift : కరోనా లాక్‌డౌన్ వల్ల ఎన్నో దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే. ఆ ఆలయాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. దీంట్లో భాగంగానే.. కొన్ని నెలలపాటూ భక్తుల దర్శనాన్ని నిలిపేసిన ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులు… అనంతరం తిరిగి ఆలయాన్ని తెరిచారు. దీంతో జగన్నాథ స్వామిని అన్ని రోజులు చూడకుండా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో స్వామి వారికి ఓ భక్తుడు సమర్పించిన బంగారు కానుకలు కనువిందు చేస్తున్నాయి.

పూరీ జగన్నాథ స్వామి వారి కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో మొత్తం 4 కేజీల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయించిన కానుకలు..కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. అంతా స్వామివారి లీల..స్వామీ నీ ఆభరణాలు ఎంత బాగున్నాయి స్వామీ..చూసేకొలదీ చూడాలనిపిస్తోంది అంటూ భక్తులు ఆ ఆభరణాలను చూసి పరవశించిపోతున్నారు. ఈ బంగారు ఆభరణాల ధర రూ.1,77,00,000 ఉంటుంది..

ఈ ఆభరణాలు ఎంతో బాగున్నాయనీ… ఎంత సేపు చూసినా… ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయని భక్తులు వాటిని చూసి తెగ మురిసిపోతున్నారు. ఆ ఆభరణాలు స్వామివారికి అలంకరిస్తే దివ్య తేజస్సుతో వెలిగిపోయే స్వామిని కన్నులారా వీక్షించేందుకు భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా..కరోనా మహమ్మారి దేశంలోని పేరు పొందిన దేవాలయాలపై ప్రభావం చూపించినట్లే… ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంపైనా చూపించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో ఒడిశాలో కరోనా కేసులు బాగా తగ్గాయి.

దీంతో స్వామివారిని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి వచ్చి… దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఓ భక్తుడు స్వామి వారి కోసం ప్రత్యేక డిజైన్లతో 4 కిలోలతో చేయించిన బంగారు ఆభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.