Tirumala: తిరుమలలో 5రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతిలో భక్తుల రద్దీ అమాంతంగా....

Tirumala
Tirumala: తిరుపతి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతిలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. కిక్కిరిసిపోతున్న భక్తుల గోవింద నామస్మరణతో ఏడు కొండలు భక్తసాగరంలో తడిచిపోతున్నాయి.
వారాంతపు సెలవులు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. రోజుకు 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్థితులు కనిపించడం ఒక కారణంగా చెప్పొచ్చు.
ఐదు రోజులుగా దర్శనార్థం నిత్యం 50వేలకు పైగా భక్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు 68వేల 95 మంది భక్తులు హాజరయ్యారు.
Read Also: Tirupatiలో భక్తుల రద్దీ, రికార్డు స్థాయిలో రెండున్నర కోట్ల ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లుగా అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీతో తిరుమల, తిరుపతిల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది.