Tiruchanoor Padmavati : పద్మావతి అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి సారె .. తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగింపు

పద్మావతి దేవికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఆలయం నుండి సారె వచ్చింది. ఈ సారెను తిరుచానూరు మాడ వీధులలో ఊరేగించారు.

Tiruchanoor Padmavati : పద్మావతి అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి సారె .. తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగింపు

Tiruchanoor Padmavati Amma ‘Sare’

Tiruchanoor Padmavati Amma ‘Sare’ : తిరుమల కొండ కింద అమ్మవారు..కొండపైన శ్రీవారు..ఏడు కొండలే కాదు ఆ ప్రాంతమంతా శ్రీవారి గానాలతో..ఆధ్మాత్మిక భావనతో నిండిపోతుంది. తిరుమల పరిసరాల్లో ఉండే భక్తులు మదిలో నిత్యం ఆ కలియుగ శ్రీనివాసుడి భావనే. గోవిందా..గోవిందా అంటూ స్మరించే భక్తుల మనస్సులు అంతే భక్తిభావంతో కొండకింద తిరుచానూరులో కొలువై  శ్రీపద్మావతి దేవిని కూడా దర్శించుకుంటారు.

అటువంటి పద్మావతి దేవికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీనివాసుడు ఆలయం నుండి సారె వచ్చింది. ఈ సారెను తిరుచానూరు మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా ఈరోజు ఉదయం 4.30 నుండి ఆలయ మాడ వీధుల్లో సారె ఊరేగింపును నిర్వహించారు. అమ్మావారి సారెను భక్తులు దర్శించుకున్నారు.

పద్మ సరోవరంలో అమ్మవారికి చక్రస్నాన మహోత్సవం
అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నేడు చివరి ఘట్టమైన పంచమి తీర్థ మహోత్సవం కావటంతో పద్మ సరోవరంలో ఇవాళ చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ముహూర్తం కావటంతో తిరుమల కొండపై నుంచి అమ్మవారికి సారే, పసుపు కుంకుమ తరలివచ్చాయి. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు వేలాదిగా హాజరుకానున్నారు. దీని కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం
కాగా ..కన్నుల పండువగా జరిగే శ్రీవారి పుష్పయాగం శుభముహూర్తం సమయం దగ్గరపడింది. శ్రీవారి ఆలయంలో రేపు పుష్పయాగానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడెక్కడో విరబూసిన రకరకాల పూలతో పాటు విదేశాల నుంచి కూడా శ్రీవారి పుష్పయాగం కోసం పూలు తరలివస్తాయి. విరబూసినందుకు శ్రీవారి యాగంలో తమ సేవను అర్పించుకోవటానికి ప్రతీ పుష్పం పరితపిస్తుందని పండితులు చెబుతుంటారు. అటువంటి ఈ పుష్పయాగంలో ఎన్నో పూలు శ్రీవారి యాగంలో తరిస్తాయి.

ఈరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ పుష్ప యాగం సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో పుష్పయాగం జరుగనుంది. దీని కోసం పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు నిర్వాహకులు.

కార్తీక మాసంలో పెరిగిన భక్తుల రద్దీ..
శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రతీ రోజు శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆకాంక్షగా ఎదురు చూస్తుంటారు. దీంట్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 17,20213) శ్రీవారిని 67,140 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకోవటం కూడా సర్వసాధారణమే. అలా నిన్న ఒక్కరోజే భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు కూడా భారీగానే ఉంటాయి. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చింది అలాగే..పుణ్యమాసం కార్తీక మాసం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెట్లు నిండిపోయాయి.బయట ఉన్న క్యూ లైన్లు టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులు దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.