సెంటిమెంట్ : ముహూర్తాలివిగో

హైదరాబాద్ : ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. జాతకాలు, సెంటి మెంట్లు ఫాలో అయ్యే రాజకీయ నాయకులు ఎన్నికల్లో నామినేషన్ వేయటం మొదలు ప్రచారం కూడా వారి, వారి, సిధ్ధాంతులు చెప్పిన ప్రకారం ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు.
ఈ ఎన్నికలు ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అంటే రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం, అలాగే నామినేషన్ ప్రక్రియ కూడా మార్చి 18 సోమవారం ద్వాదశి నాడు ప్రారంభమైంది. దీనితో ప్రతి ఒక్కరూ ముహూర్తాలు చూసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ 18 వ తేదీ నుండి 25తేదీ వరకు ప్రక్రియ జరగనుంది. చాలా మంది రకరకాల తారీఖులను సుముహూర్తాలను తెరమీదకి తెస్తున్నారు. కాగా …. లగ్నం బలముగా ఉన్నచో చాలా దోషాలను అధిగమించవచ్చని చెపుతున్నారు హైదరాబాద్ కు చెందిన దైవజ్ఞ. నిట్టల ఫణి భాస్కర్ అనే జ్యోతిష్య పండితుడు. ఈ వారం రోజుల్లో 22,23,25 తేదీల్లో నామినేషన్లకు అనువైవ సమయాలను ఆయన వివరించారు.
18- ద్వాదశి, ఆశ్రేషా నక్షత్రం
19- త్రయోదశి, మఖ నక్షత్రం
20- తిధిద్వయం చతుర్దశి ఉదయం 10:45 వరకు తదుపరి పౌర్ణమి, పుబ్బ నక్షత్రం
21- Holiday
22- విదియ, హస్త నక్షత్రం
23- తదియ, స్వాతి నక్షత్రం
24 – Holiday
25- పంచమి, అనూరాధ నక్షత్రము
నామినేషన్ ప్రక్రియకు ఖచ్చితంగా పంచేష్టక బలం ఉండాలి. తిధి,వార,నక్షత్ర,యోగ, కరణములు, అలాగే లగ్నాధిప, కాలాధిప, సూర్య,చన్ర్ద, గురు ల యొక్క బలం ఎంతో ముఖ్యమైనవి. అలాంటి ముహూర్తం కేవలం రెండు లగ్నాలకు మాత్రమే ఉంది. అందులో (1)కర్కాటకం (2) సింహ లగ్నం. 22-03-2019 వరకు కర్కాటక లగ్నంలో నామినేషన్ వేయడం వల్ల విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనగా మధ్యాహ్నం గం.1:30 నుండి 4. గంటల మధ్యలో, 22,23,25 తారీఖులలో సింహ లగ్నంలో నామినేషన్ వెయ్యడం యోగ్యమైనదిగా చెప్పవచ్చు. అనగా గం.3:15 నుండి 4 గంటల మధ్యలో నామినేషన్ వేస్తే విజయావకాశాలు ఉంటాయని ఫణి భాస్కర్ వివరించారు.