Kapila Theertham : కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు.

kapila theertham
Kapila Theertham : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.