Nagula Panchami: నాగుల పంచమి (గరుడ పంచమి) విశిష్టత ఏంటి.. ఏం చేయాలి
దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు ఇదేనన్నమాట.

Nagula Panchami
Nagula Panchami: ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి(గరుడ పంచమి)ని జరుపుకుంటారు. దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు ఇదేనన్నమాట.
ఎలా చేయాలి:
నాగ పంచమి ఎలా చేస్తారు? నాగ పంచమి రోజున ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తలంటు స్నానం తర్వాత నిత్యపూజ పూర్తి చేస్తారు. దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు పెట్టి.. గంధం చిలకరిస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ ఐదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు.
ఉపవాసం ఎంతవరకూ:
పాలు, పండ్లు, నాగ పడిగేలు, నువ్వులు, జొన్నపెలాలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ‘విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ – అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్ట దగ్గర ఒక ఆకుతో చేసిన దొప్పలో ఆవుపాలు పోస్తారు. నాగ విగ్రహాలకు మాత్రం శిరస్సుపై నుండి పోయాలి. పాలు పుట్టలో పోయకూడదు. నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు.
అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా, అన్నీ సవ్యంగా అనుకూలంగా ఉంటుంది. నాగ పంచమి, సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది.