Sri Shakti Mahotsavam : శ్రీ శక్తి మహోత్సవములు పేరిట భారీగా శరన్నవరాత్రులు.. మొదటిసారి హైదరాబాద్‌లో..
మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.

Sri Shakti Mahotsavam Celebrations in Hyderabad for Dasara
రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా(Dasara) సంబరాలు మొదలయ్యాయి. ఘనంగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈసారి మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. స్వస్తశ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి అక్టోబర్ 15 ఆదివారం నుండి ఆశ్వయుజ నవమి అక్టోబర్ 23 సోమవారం వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 9-30 గంటల వరకు KPHB వద్ద గల కైతలాపుర్ గ్రౌండ్స్ లో దసరా పండుగ సందర్భంగా శ్రీ శక్తి మహోత్సవాలు తొలిసారిగా హైదరాబాద్ లో ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే భక్తులు అందరూ రావొచ్చని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ తొమ్మిది రోజులు కూడా యాగ బ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ హోతా సతీష్ కృష్ణ శర్మ గారి బ్రహ్మత్వంలో, జోతిష్య విద్యా విశారద శ్రీ ఆది వారాహి ఉపాశక శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ రావు గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు, సేవలు, కల్యాణాలు నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మి గణపతి హోమం, రుద్ర యమలోక్త పాశుపత మహా మన్యు సూక్త పారాయణ హోమం, దశమహావిద్య హోమం,ఆదిత్యాది నవగ్రహ ఆరాధనా హోమం, చండీ హోమం, శ్రీ ఉచ్చిష్ట మహాగణపతి హోమం, శ్రీ సూక్త హోమం, సరస్వతి హోమాలతో పాటు సామూహిక అక్షరాభ్యాసాలు, నవదుర్గ పల్లకీ సేవలు, శ్రీ చక్రనవావరణ అర్చన, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం, కామ్యవృషోగజనమ్ (గో కళ్యాణం) మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడును.
అలాగే ప్రతీ రోజు బతుకమ్మ ఉయ్యాల పాటలతో గౌరీ దేవి పూజలు, సంగీతంతో దాండియా, మన తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు, కేరళ, కర్ణాటక, మహా రాష్ట్ర, బెంగాలీ, వంటి భిన్న సంసృతి కలిగిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సినీ, టివి రంగానికి చెందిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ శ్రేయాస్ మీడియా గ్రాండ్ గా అరేంజ్ చేస్తుంది.
హైదరాబాద్లోనే అతిపెద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి?
శ్రీ శక్తి మహోత్సవంలో భాగంగా అక్టోబరు 15 నుండి 23 వరకు జరిగే విశిష్ట అర్చనలు, అభిషేకాలు,హోమాలు, బతుకమ్మ, దాండియా…ఇలా విశిష్ట కార్యక్రమాలలో పాల్గొని ఈ నవరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకోండి ?
Join us in the… pic.twitter.com/cTIl1hTvT5
— Shreyas Media (@shreyasgroup) October 15, 2023
ఇక ఈ ప్రత్యేక పూజలలో, హోమాలలో ఎవరైనా పాల్గొనాలన్న, అక్కడ స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలనుకున్నా, మరియు మిగతా వివరాలకు 8466012345 నంబర్ ని సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు www.srishakthimahotsavam.com సైట్ సందర్శించొచ్చు.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు