Srisailam : భక్తులకు ఇబ్బందులు కలుగవద్దు, సౌకర్యాలు కల్పించాలి
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల ఆలయ ఈవో లవన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Srisailam
Srisailam EO : ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల ఆలయ ఈవో లవన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ..ముందుకు సాగాలని సూచించారు. 2021, ఆగస్టు 28వ తేదీ శనివారం దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షులతో ఈవో సమావేశం నిర్వహించారు.
Read More : Cat Rescue : గర్భంతో ఉన్న పిల్లిని పట్టారు, రూ.10లక్షలు సంపాదించారు
దేవస్థానంలో జరుగుతున్న పనులు, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. ఆలయంలో జరిగే పూజాధికాలు, దేవస్థానం నిర్వహిస్తున్న హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి సదుపాయాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణ, భక్తులకు అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
Read More : Jarvo Ban : కోహ్లి ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జార్వోకు భారీ షాక్.. జీవితకాల నిషేధం
ఈ సందర్భంగా ఆలయ ఈవో లవన్న మాట్లాడుతూ…ప్రతి విభాగం నైపుణ్యం పెంచుకుంటూ ముందుకు సాగాలని, అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. దేవస్థాన పథకాలు, గోశాల, వైద్య శాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ…దాతల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.
Read More : Guntur : ఒక్కడే వచ్చాడు..తల్లీ కూతుళ్లను పొడిచి పొడిచి చంపేశాడు
ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దేవతా మొక్కలను వీలైనంత ఎక్కువ ప్రదేశాల్లో పెంచాలని సూచించారు.