Tirupati : చిన్న శేష వాహనంపై శ్రీరామ చంద్రమూర్తి చిద్విలాసం
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన...

Tirupati
Kodandarama Swamy Brahmotsavam : తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శేష వాహనంపై పలు రూపాల్లో కోదండరామ స్వామి వారు దర్శనమిస్తున్నారు. నాలుగు మాడ వీధుల్లో తిరుగుతున్న వాహన సేవలను తిలకించడానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. హారతిలు ఇస్తూ.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు 2022, మార్చి 31వ తేదీ గురువారం ఉదయం శ్రీ కోదండరామ స్వామి వారు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
Read More : Tirupati : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
Read More : Tirumala Tirupati : ఏప్రిల్ 16న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం
వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీ శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.