TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, దర్శన తేదీ మార్చుకోవచ్చు..కొత్త టికెట్లు పొందే అవకాశం
ఆరు నెలల్లోపు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని, ప్రస్తుతం భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

Good New Devotees : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వినిపించింద టీటీడీ. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలకు రాలేని వారు..దర్శన తేదీ మార్చుకోవచ్చని సూచించింది. ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించింది. టీటీడీ వెబ్ సైట్ లో దర్శన తేదీ మార్చుకొనేందుకు కొత్త సాప్ట్ వేర్ తయారు చేయడం జరుగుతోందని, దర్శన టికెట్ల నంబర్ నమోదు చేసి నూతన టికెట్లను పొందవచ్చునని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
Read More : Seerat Kapoor: చూపులతో మాయచేయగల ముంబై భామ సీరత్!
ఆరు నెలల్లోపు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని, ప్రస్తుతం భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఘాట్ రోడ్డులో ధ్వంసమైన ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా…నాలుగు ప్రాంతాలో కల్వర్టులు దెబ్బతిన్నట్లు…అలిపిరి నడక మార్గంలో ఎలాంటి ఇబ్బందులు జరగలేదన్నారు. రెండు ఘాట్ రోడ్లలో వాహనాలను అనుమతినిస్తున్నట్లు తెలిపారు.
Read More : Swiggy One : స్విగ్గీ కస్టమర్లకు శుభవార్త, అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు
తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఇక దర్శనానికి వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్లమార్గం కొట్టుకపోయంది. కొండచరియలు విరిగిపడడంతో కొన్ని రోజులు ఘాట్ రోడ్డును మూసివేశారు.