Tirumala Udayastamana seva : తిరుమల ఆలయంలో ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర  స్వామి వారి ఆలయంలో  ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ  త్వరలో   విడుదల చేయనుంది.

Tirumala Udayastamana seva  : తిరుమల ఆలయంలో ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లు

Tirumala Udayastamana Seva Tickets

Updated On : December 19, 2021 / 11:41 AM IST

Tirumala Udayastamana seva  :  తిరుమల శ్రీ వెంకటేశ్వర  స్వామి వారి ఆలయంలో  ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ  త్వరలో   విడుదల చేయనుంది. సాధారణ రోజుల్లో టికెట్ ఒక్కింటికి   రూ.కోటి గానూ…శుక్రవారం రోజున రూ.1.5  కోట్లుగా  టీటీడీ  ధర  నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ టికెట్‌ తీసుకున్న భక్తులు   దాదాపు 25 ఏళ్ల పాటు స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు.  ఈ సేవా టికెట్ కొన్నభక్తుల కుటుంబ సభ్యులు ఆరుగురు ఏడాదిలో ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు పాల్గొనే సౌలభ్యాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ తో టీటీడీకి దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.
Also Read : Caste Boycott : కామారెడ్డి జిల్లాలో కుటుంబం కుల బహిష్కరణ-3నెలలుగా ఇబ్బందులు
ఉదయాస్తమాన సేవలు ఎవరి సిఫార్సు లేకుండా భక్తులే నేరుగా పొందే విధంగా టీటీడీ సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది.  అందుకోసం టీటీడీ సాంకేతిక విభాగం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే  టీటీడీ ఈ సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి  తీసుకురానుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల  ఆస్పత్రి  అభివృద్ధికి  కేటాయించాలని టీటీడీ   పాలక మండలి నిర్ణయం తీసుకుంది.