10టీవీ ఎఫెక్ట్ : బాక్సర్ అరుణకు సాయంఅందిస్తాం.. మంత్రి జవహర్

10టీవీ ఎఫెక్ట్ : బాక్సర్ అరుణకు సాయంఅందిస్తాం.. మంత్రి జవహర్
హైదరాబాద్ : బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించి, పేదరికంలోఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న విశాఖపట్నంకు చెందిన అరుణకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆమెరు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన బాక్సర్ అరుణ ఇప్పుడు సరైన ప్రోత్సాహంలేక నిరుత్సాహంతో బాక్సింగ్ నుంచి విరమించాలనుకుంది. ఆమె దీన గాధ తెలుసుకున్న 10 టీవీ, సోమవారం ఆమెకున్న కష్టాలపై ఆమెతో చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. లైవ్ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి జవహర్ ఆమె కష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పూర్తి సహాయం అందిస్తానని తెలిపారు.
వైసీపీ నుంచి కూడా పూర్తి సాయం అందిస్తాం: కరణం ధర్మశ్రీ
పేదరికంలో ఉన్నఅరుణకు వైసీపీ తరుఫునుంచి సంపూర్ణ మద్దతిస్తామని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. విశాఖపట్నానికి చెందిన బాక్సర్ అరుణ పరిస్ధితిని తెలుసుకుని ఆయన వైసీపీ నాయకులతో మాట్లాడి ఆమెకు పార్టీనుంచి సహాయ సహాకారాలు అందించి ఆమె టోర్నమెంట్లలో పాల్గోనేందుకు కావాల్సిన ప్రోత్సహాకాలు అందిస్తామని తెలిపారు.