Vaibhav Suryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత వేగవంతమైన 100.. జస్ట్..

భారత అండర్ 19 జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాట్స్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్ తో రికార్డు సమయంలో శతకాన్ని అందుకున్నాడు.

Vaibhav Suryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత వేగవంతమైన 100.. జస్ట్..

Updated On : July 5, 2025 / 8:27 PM IST

Vaibhav Suryavanshi: పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు, బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోతున్నాడు. బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అలవోకగా పరుగుల వరద పారిస్తున్నాడు. భారత అండర్ 19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుతో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసి యూత్ వన్డే క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.

ఇంగ్లాండ్ U-19 జట్టుతో నాలుగో మ్యాచ్ లో వైభవ్ సెంచరీతో కదంతొక్కాడు. జస్ట్ 52 బంతుల్లో అద్భుతమైన శతకం సాధించాడు. తద్వారా యూత్ వన్డే క్రికెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర లిఖించాడు. భారత అండర్ 19 జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాట్స్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్ తో రికార్డు సమయంలో శతకాన్ని అందుకున్నాడు. 52 బంతుల్లోనే శతకం.. అండర్ 19 వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సర్ఫరాజ్ ఖాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 2013లో దక్షిణాఫ్రికా U-19 జట్టుపై సర్ఫరాజ్ 15 సంవత్సరాల 338 రోజుల్లో సెంచరీ చేశాడు. అలాగే బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో రికార్డును కూడా అధిగమించాడు. 2013లో 14 సంవత్సరాల 241 రోజుల్లో సెంచరీ చేసిన నజ్ముల్ హుస్సేన్ శాంటో రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.

Also Read: ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన ల‌క్ష్య ఛేద‌న ఎంతంటే..?

వైభవ్ మెరుపులు ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన యూత్ వన్డే సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాయి. పాకిస్తాన్‌కు చెందిన కమ్రాన్ గులాం గతంలో 2013లో ఇంగ్లాండ్ U-19పై 53 బంతుల్లో సెంచరీ చేసి ఈ రికార్డును కలిగి ఉన్నాడు. భారతదేశం తరపున, 2022 U-19 ప్రపంచ కప్‌లో ఉగాండాపై రాజ్ అంగద్ బావా 69 బంతుల్లో సెంచరీ చేయడం వైభవ్ సెంచరీకి ముందు అత్యంత వేగవంతమైనది.

ఈ సిరీస్‌ లో వైభవ్ బీభత్సమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. పవర్ ఫుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో 306 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదే సిరీస్‌లోని మూడో వన్డేలో 31 బంతుల్లోనే 86 పరుగులు చేసి విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు.

2025 ఐపీఎల్ సీజన్‌లోనూ వైభవ్ దుమ్మురేపాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ కుర్రాడు తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా, ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.