ఐపీఎల్ 2020 వేలానికి వేదిక మారింది.. ఎందుకంటే

ఐపీఎల్ 2020 వేలానికి వేదిక మారింది.. ఎందుకంటే

Updated On : October 1, 2019 / 5:34 AM IST

క్రికెట్‌లో షార్ట్ ఫార్మాట్ టీ20 అంటేనే ఓ క్రేజ్.. అందులోనూ ఐపీఎల్ లాంటి దేశీవాలీ లీగ్ అంటే విపరీతమైన అభిమానం. ఏటా బెంగళూరు వేదికగా జరిగే ఈ టోర్నీ వేలం ఈ సారి కొత్త ప్రదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనికి కారణం వచ్చే ఏడాది జరగాల్సిన వేలం కంటే 2019 డిసెంబరు 19న జరిగే 2020 సీజన్‌కు సంబంధించిన వేలం తక్కువ మొత్తంలో జరుగుతుందన్నమాట. 

2021వేలానికి కొత్త జట్లతో మెరవనుంది ఐపీఎల్. గతంలో జరిగిన వేలాల్లో 2018వేలమే అత్యధికం. జట్టుకు 5గురు ప్లేయర్లను మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని వేలానికి విడిచిపెట్టారు. దీంతో భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగాయి. మరోసారి అంత స్థాయిలో జరిగేది 2021లో మాత్రమే. 2020 వేలానికి మాత్రం రూ.85కోట్లలోపే కేటాయించిన బీసీసీఐ.. వాటితోనే జట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. 

గతేడాది జరిగిన వేలంలో జట్ల వద్ద ఇంకా డబ్బులు మిగిలి ఉండడంతో ఒక్కో ఫ్రాంచైజీ ఇంకా అదనంగా రూ.3కోట్లు మేర కేటాయించగలదు. మిగిలిన మొత్తాల ఆధారంగా జట్ల వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రూ .8.2 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ (రూ. 7.15 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ .6.05 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 5.3 కోట్లు), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (రూ. 3.7 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 3.2 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ. 3.05 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ .1.8 కోట్లు).