అంత పొడుగైతే మాకొద్దు: లక్నో హోటళ్లో రూం దొరక్క క్రికెట్ అభిమాని

అంత పొడుగైతే మాకొద్దు: లక్నో హోటళ్లో రూం దొరక్క క్రికెట్ అభిమాని

Updated On : November 7, 2019 / 5:18 AM IST

భారత్‌లోని లక్నో వేదికగా జరగనున్న అఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే క్రికెట్ చూడటానికి వచ్చిన అభిమాని చిక్కుల్లో పడ్డాడు. అఫ్ఘన్ నుంచి వచ్చిన ఎనిమిది అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న షేర్ ఖాన్ లక్నోలోని పలు హోటళ్లు తిరిగాడు. నవంబరు 6న మొదలైన ఈ వన్డే మ్యాచ్ లల కోసం అఫ్ఘినిస్తాన్ నుంచి భారత్ కు వచ్చాడు. 

తలదాచుకునేందుకు అన్నీ హోటళ్లు తిరిగాడు. ఒక్కరు కూడా అతనిని హోటళ్లలో ఉండేందుకు అనుమతించలేదు. ఎత్తుకు భయపడి ఏ హోటల్ ఒప్పుకోకపోవడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాడు. నాకా ప్రాంతంలో ఉన్న హటల్ రాజధానికి తీసుకెళ్లి అతనికి ఆశ్రయం ఇప్పించారు. దీంతో మంగళవారం రాత్రి అక్కడ ఉండగలిగాడు. 

కాబుల్ నుంచి వచ్చిన వ్యక్తిని చూడటానికి తెల్లవారిన తర్వాత హోటల్ బయటగుమిగూడారు. దాదాపు 200మంది అక్కడకు రావడంతో అతనికి కాస్త ఇబ్బందికరంగా మారింది. స్థానికుల నుంచి కాపాడేందుకు పోలీసుల ఎస్కాట్ తరలివచ్చి అతణ్ని ఎకానా స్టేడియంకు తీసుకెళ్లారు. అంతర్జాతీయ వన్డే చూడటానికి వచ్చిన షేర్ ఖాన్ నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉంటాడు.