AFG vs SA : ద‌క్షిణాఫ్రికా పై ఓట‌మి.. అఫ్గాన్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అస‌లు ఇదేం పిచ్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది.

AFG vs SA : ద‌క్షిణాఫ్రికా పై ఓట‌మి.. అఫ్గాన్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అస‌లు ఇదేం పిచ్‌..

Afghanistan Coach Jonathan Trott Fumes At ICC After T20 World Cup Semi final Defeat

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. లీగ్‌, సూప‌ర్ 8 ద‌శ‌లో అసాధార‌ణ పోరాటం చేసిన అఫ్గాన్ కీల‌కమైన సెమీ ఫైన‌ల్ మ్యాచులో చేతులెత్తేసింది. ట్రినిడాడ్ వేదిక‌గా గురువారం ఉద‌యం దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గాన్‌ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కేవ‌లం 56 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో సెమీఫైన‌ల్ మ్యాచుల్లో అత్య‌ల్ప స్కోరు న‌మోదు చేసిన జ‌ట్టుగా రికార్డుల‌కు ఎక్కింది.

ఇక మ్యాచ్ ముగిసిన త‌రువాత ఆ జ‌ట్టు కోచ్ జొనాథ‌న్ ట్రాట్ మాట్లాడుతూ.. పిచ్ పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ను ఇలాంటి పిచ్‌పై ఆడాల‌ని ఏ జ‌ట్టు కోరుకోద‌న్నాడు. తాము ఓడిపోయామ‌ని ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేద‌న్నాడు. సెమీఫైన‌ల్ లాంటి మ్యాచ్‌కు ఈ వేదిక స‌రికాద‌న్నాడు. పేస‌ర్ల‌కు, సిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉండ‌కుండా కేవ‌లం ఫ్లాట్‌గా పిచ్‌లు ఉండాల‌ని తాము కోరుకోవ‌డం లేద‌న్నాడు.

IND vs ENG semi final : ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌.. మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్ట‌మేనా..? ఏ గంట‌కు ఎంత వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందంటే..?

బంతిని ఆడేందుకు బ్యాట‌ర్లు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఈ మ్యాచ్ చూసిన ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతున్నాడు.టీ20 మ్యాచులు అంటే అటాక్ చేయ‌డం, ప‌రుగులు రాబ‌ట్టం, వికెట్లు తీయ‌డం త‌ప్ప‌.. వికెట్లు కాపాడుకోవ‌డానికి బ్యాట‌ర్లు ప్ర‌య‌త్నించ‌డం కాద‌ని తెలిపాడు.

ఇరు జ‌ట్ల‌కు పిచ్ ఇబ్బందిక‌రంగానే ఉంద‌న్నాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ త‌క్కువ స్కోరు చేయ‌డంతో మ్యాచ్ ద‌క్షిణాఫ్రికా గెలిచింద‌ని, అంతేగానీ ఈ మ్యాచ్‌లో అస‌లైన పోరు జ‌ర‌గ‌లేద‌ని ట్రాట్ అన్నాడు.

Nitish Reddy : తెలుగు ఆట‌గాడు నితీశ్ రెడ్డికి షాక్‌.. మొన్న ఎంపిక చేశారు.. నిన్న తీసేశారు..!