IND vs ENG semi final : ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌.. మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్ట‌మేనా..? ఏ గంట‌కు ఎంత వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందంటే..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. గ‌యానా వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు సెమీ పైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

IND vs ENG semi final : ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌.. మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్ట‌మేనా..? ఏ గంట‌కు ఎంత వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందంటే..?

IND VS ENG

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. గ‌యానా వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు సెమీ పైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు, భార‌త కాల‌మానం ప్ర‌కారం గురువారం రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే.. గ‌యానాలో మ్యాచ్ స‌జావుగా జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌కు రిజ‌ర్వ్ డే లేదు. కేవ‌లం 250 నిమిషాల అద‌న‌పు స‌మ‌యాన్ని కేటాయించారు. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తితో విజేత‌ను నిర్ణ‌యించాలి అన్నా ఇరు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున మ్యాచ్ ఆడాల్సి ఉంది.

అక్యూ వెద‌ర్ ప్ర‌కారం.. గ‌యానాలో రోజంతా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9 (6:30 PM IST) త‌రువాత జ‌ల్ల‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఉద‌యం 11 గంట‌ల‌కు (8:30 PM IS) గ‌రిష్ట స్థాయికి చేరుకునే అవ‌కాశం ఉంది. 12 త‌రువాత త‌గ్గే ఛాన్స్ ఉంది.

Rashid Khan : ద‌క్షిణాఫ్రికా పై ఓట‌మి.. కెప్టెన్ ర‌షీద్ ఖాన్ కీల‌క వ్యాఖ్య‌లు..

గ‌యానా కాల‌మానం ప్ర‌కారం.. వ‌ర్షం వ‌చ్చే అవ‌కాశం..

ఉద‌యం 9 గం.ల‌కు (6:30 PM IST) – 40 %
ఉద‌యం 10 గం.ల‌కు (7:30 PM IST) – 66 %
ఉద‌యం 11 గం.ల‌కు (8:30 PM IST) – 75 %
మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు (9:30 PM IST) – 49 %
మ‌ధ్యాహ్నం 1 గం.ల‌కు (10:30 PM IST) – 34 %
మ‌ధ్యాహ్నం 2 గం.ల‌కు (11:30 PM IST) – 34 %
మ‌ధ్యాహ్నం 3గం.ల‌కు (12:30 PM IST) – 40 %

రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అర్ధరాత్రి 12.10 గంటల వరకు ప్రారంభం కాకపోయినా ఎలాంటి న‌ష్టం లేదు. 12.10లోపు ఎప్పుడు ప్రారంభ‌మైనా స‌రే ఎలాంటి ఓవ‌ర్ల కోతా లేకుండా 20 ఓవర్ల పాటు మ్యాచ్‌ను కొన‌సాగ‌నుంది. 12.10 త‌రువాత ఓవ‌ర్ల కోత మొద‌లు కానుంది. 1.44 వ‌ర‌కు కూడా మ్యాచ్ మొద‌లు కాక‌పోతే ర‌ద్దు చేస్తారు. ఆ స‌మాయానికి మ్యాచ్ నిర్వ‌హించే అనుకూల ప‌రిస్థితులు ఉంటే 10 ఓవ‌ర్ల ఆట జ‌ర‌గ‌నుంది.

0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !

ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మ్యాచ్ ర‌ద్దు అయితే.. భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ ఇంటి ముఖం ప‌ట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సూప‌ర్ 8 ద‌శ‌లో త‌న గ్రూపులో భారత్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా గ్రూపు-బిలో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. మెరుగైన స్థానంలో నిలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు వెళ్ల‌నుంది.