PAK vs AFG Match: స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్న పాక్, అఫ్గానిస్థాన్ అభిమానులు .. వీడియో వైరల్
ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా సూపర్-4లో బుధవారం రాత్రి పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో పాక్ మద్దతుదారులపై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pakistan vs Afganitan Fight
PAK vs AFG Match: ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా సూపర్-4లో బుధవారం రాత్రి పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టుకు అప్గానిస్థాన్ చుక్కలు చూపించింది. చివరి వరకు పాక్ ఓడిపోతుందనే అందరూ భావించారు. కానీ చివరి ఓవర్లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ పాకిస్థాన్ – భారత్ మధ్య జరుగుతుందా అన్నట్లు స్టేడియంలో ఇరు దేశాల మధ్య అభిమానులు ఉత్కంఠభరితంగా వీక్షించారు. పాకిస్థాన్ విజయం అనంతరం అఫ్గానిస్థాన్ అభిమానులు రెచ్చిపోయారు. దీంతో ఇరుజట్ల అభిమానులు వాగ్వివాదంతో పాటు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవటంతో స్టేడియంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Asia Cup 2022 : భారత్ ఫైనల్ ఆశలు ఆవిరి.. అప్ఘానిస్తాన్పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ
బుధవారం రాత్రి పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరకు పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో సొంత టీం ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్.. స్టేడియంలో పాక్ అభిమానులపై దాడికి దిగారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. కుర్చీలు పీకిపడేశారు.
https://twitter.com/arhuml92/status/1567586234343505926?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1567586234343505926%7Ctwgr%5E7fa10bbde858e88a909fc5f117dedaf692ef1c46%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsports%2Fasia-cup-fans-hit-each-other-with-chairs-at-stadium-after-pakistan-beat-afghanistan-753402
దీంతో పాక్ జట్టు అభిమానులుసైతం తిరగబడటంతో స్టేడియంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ రచ్చ చేశారు. పాక్ జెర్సీ వేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది.