కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక పదవిలో అనిల్ కుంబ్లే

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో కలిసి ప్రయాణించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్, 2014లోనూ ఫైనల్ వరకూ వెళ్లింది. ఎన్నాళ్లుగానో ట్రోఫీని అందుకోవాలనే కల అందని ద్రాక్షలా మిగిలిపోయింది.
కుంబ్లే లాంటి అనుభవమున్న కెప్టెన్ జట్టుతో కలిస్తే ఈ సారైనా ట్రోఫీ అందుకోగలమనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది జట్టు యాజమాన్యం. పంజాబ్‌తో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకూ ట్రోఫీ గెలుపు రుచి చూడలేదు. అనిల్ కుంబ్లే గతంలో బెంగళూరు జట్టుతో కలిసి ప్రయాణించాడు.
ఈ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌కు అనిల్ కుంబ్లే మా చాయీస్. టెక్నికల్‌గా, అనుభవం పరంగా కుంబ్లే ఉండటం జట్టుకు విలువ పెంచుతుందని అనుకుంటున్నాం. తద్వారా మా గోల్ చేరుకోగలం’ అని ఆయన తెలిపారు. గతంలో కుంబ్లే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు, ముంబై ఇండియన్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు.