Suryakumar Yadav: కోహ్లీతో రన్నింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన అనుష్క శర్మ.. సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్
అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అనుష్క పోస్టుకు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కోహ్లీని ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలతో కామెంట్ చేశాడు.

Suryakumar Yadav
Suryakumar Yadav Trolls To Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తమకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి రోడ్డుపై రన్నింగ్ చేసిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క శర్మ షేర్ చేసింది. ఈ ఫొటోలను ఉద్దేశించి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. కోహ్లీని ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేశాడు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Virat Kohli : కోహ్లీ క్రికెటర్ కాకపోయుంటే ఏ క్రీడలో రాణించేవాడు..? భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడంటే..
ఆసియా కప్-2023, ప్రపంచ కప్-2023కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈనెల 30 నుంచి ఆసియా కప్ జరుగుతుంది. ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఇటీవల భారత్ – వెస్టిడీస్ వన్డే సిరీస్‍లో కోహ్లీ ఆడాడు. ఆ తరువాత జట్టు యాజమాన్యం కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. ఈ విరామ సమయంలో వ్యాయామం చేయడం, ప్రమోషనల్ షూట్‌లలో కోహ్లీ బిజీగా ఉంటూవస్తున్నాడు. ఇటీవల అతని భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ రోడ్లపై రన్నింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
Cricket Legend : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూత
అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అనుష్క పోస్టుకు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కోహ్లీని ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలతో కామెంట్ చేశాడు. ‘భయ్యా మీ రన్నింగ్ టెక్నిక్ కొంచెం బలహీనంగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram