పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌కి రూ.12కోట్ల జరిమానా

ఐపీఎల్ 2019లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌కు భారీగా జరిమానా పడింది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీకి జరిమానాలతో పాటు రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా జరిమానా విధించింది.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చాలా గందరగోళానికి గురైయ్యాడు. మ్యాచ్ సమయంలో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్‌లతో సమయం చాలా వృథా చేశాడు. దీంతో లీగ్‌లో జట్టుకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువసేపు తీసుకోవడంతో అశ్విన్‌కి రూ. 12 లక్షలు జరిమానా విధించారు.
తాజా సీజన్లో ఇలా శిక్షకు గురైన వారిలో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ, రహానెలతో పాటుగా అశ్విన్ కూడా చేరాడు. ఈ మ్యాచ్‌లో గేల్ వీర బాదుడుకి ఏ మాత్రం లాభం లేకుండాపోయింది. 164పరుగుల టార్గెట్ చేధించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.