PAK vs NEP : ఆసియా క‌ప్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌.. నేపాల్ పై ఘ‌న విజ‌యం

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న ఆసియా క‌ప్ ప్రారంభ‌మైంది. నేపాల్ పై పాకిస్తాన్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది

PAK vs NEP : ఆసియా క‌ప్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌.. నేపాల్ పై ఘ‌న విజ‌యం

PAK vs NEP

Updated On : August 30, 2023 / 9:41 PM IST

పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యం

343 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నేపాల్ 23.4 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో పాకిస్తాన్ 238 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ విజ‌యంతో పాక్ ఆసియా క‌ప్‌లో ఘ‌న‌మైన బోణి కొట్టింది. పాక్ బౌల‌ర్ల‌లో షాబాద్ ఖాన్ నాలుగు వికెట్లతో నేపాల్ న‌డ్డి విరిచాడు. మిగిలిన వారిలో ష‌హీన్ అఫ్రీది, హరీస్ రవూఫ్ చెరో రెండు, న‌సీమ్ షా, న‌వాజ్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

నేపాల్ టార్గెట్ 343

కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్స‌ర్లు) భారీ శ‌త‌కంతో విరుచుకుప‌డ‌డంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 342 ప‌రుగులు చేసింది. దీంతో నేపాల్ ముందు 343 ప‌రుగుల లక్ష్యం నిలిచింది. బాబ‌ర్ తో పాటు ఇప్తికార్ అహ్మ‌ద్ (109 నాటౌట్; 71 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్స‌ర్లు) కూడా దంచి కొట్ట‌డంతో పాక్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (44) రాణించాడు. నేపాల్ బౌల‌ర్ల‌లో సోంపాల్ కామి రెండు వికెట్లు తీయ‌గా కరణ్ కెసి, సందీప్ లామిచానేలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

10 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోరు 44/2

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు నేపాల్ బౌల‌ర్లు వ‌రుస షాక్‌లు ఇచ్చారు. ఓపెన‌ర్లు ఫఖర్ జమాన్ (14), ఇమామ్-ఉల్-హక్ (5) ల‌ను స్వ‌ల్వ వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేర్చారు. దీంతో 25 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ కష్టాల్లో ప‌డింది. కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌(12), మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌(7)లు జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. 10 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోరు 44/2.

 

నేపాల్ తుది జ‌ట్టు : కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ పౌడెల్(కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కేసీ, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి

పాకిస్థాన్ తుది జ‌ట్టు : ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీప‌ర్‌), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

 

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న ఆసియా క‌ప్ ప్రారంభ‌మైంది. మొద‌టి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.