AsiaCup Final : ఫైనల్‌కు పాకిస్థాన్.. మళ్లీ దాయాదుల పోరు.. టీమిండియాకు పాక్ కెప్టెన్ సవాల్.. ఇక రెడీ..

Asia Cup 2025 Final : ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈనెల 28న రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

AsiaCup Final : ఫైనల్‌కు పాకిస్థాన్.. మళ్లీ దాయాదుల పోరు.. టీమిండియాకు పాక్ కెప్టెన్ సవాల్.. ఇక రెడీ..

Asia Cup 2025 Final

Updated On : September 26, 2025 / 8:45 AM IST

AsiaCup Final : ఆసియా కప్ – 2025 టోర్నీలో మూడోసారి భారత్, పాకిస్థాన్ సమరాన్ని చూడబోతున్నాం. సూపర్-4లో గురువారం పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగగా.. 11 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Also Read: Asia Cup 2025 : అభిషేక్ శర్మ ఊచకోత.. చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!

బంగ్లా జట్టుపై విజయం తరువాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక కామెంట్స్ చేశారు. ఒకవిధంగా టీమిండియాకు సవాల్ విసిరాడు. ‘ఇలాంటి కష్టమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను గెలిచామంటే మేం కచ్చితంగా ఒక ప్రత్యేకమైన జట్టు. తమ జట్టులోని ప్రతిఒక్కరూ బాగా ఆడారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రీది ఒక అద్భుతమైన ఆటగాడు. జట్టుకు ఏది అవసరమో అతను అదే చేస్తాడు. అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఏ జట్టునైనా ఓడించగలం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఫైనల్లో భారత్ జట్టును ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని సల్మాన్ పూర్తి విశ్వాసం చూపించారు. అదే సమయంలో ఫైనల్లో మా సత్తా చూపిస్తామంటూ భారత్ జట్టుకు సవాల్ చేశాడు.

ఆసియా కప్-2025 టోర్నీలో ఇప్పటికే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగాయి. ఆ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరడంతో.. మరోసారి ఫైనల్లో దాయాది జట్లు తలపడనున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

ఇదిలాఉంటే.. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్లు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లోఉన్న దశలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పాక్‌ను ఆదుకున్నారు. బంగ్లా ముందు ఛాలెంజింగ్ స్కోర్ ఉంచగలిగారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు.
136 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్ తలో మూడు వికెట్లు తీశారు. అయుబ్ 2 వికెట్లు పడగొట్టాడు.