Asia Cup 2025 : అభిషేక్ శర్మ ఊచకోత.. చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!

Asia Cup 2025 : ఆసియాకప్ 2025 టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌‌తో చెలరేగిపోతున్న అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును సృష్టించాడు.

Asia Cup 2025 : అభిషేక్ శర్మ ఊచకోత.. చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!

Abhishek sharma

Updated On : September 25, 2025 / 7:00 AM IST

Asia Cup 2025 : ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో భాగంగా బుధవారం రాత్రి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. బంగ్లా జట్టుపై 41 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. టోర్నీలో ఫైనల్ కు దూసుకెళ్లింది.

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) చెలరేగి పోయాడు. తనదైన శైలిలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా అభిషేక్ 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సులు బాదాడు.


ఆసియాకప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో మొదటి నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోతున్న అభిషేక్ శర్మ బంగ్లాదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు. సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.


బంగ్లాదేశం జట్టుతో జరిగిన మ్యాచ్ అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. అయితే, ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన అభిషేక్.. 248 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 24 ఫోర్లు, 17 సిక్సులు కొట్టాడు. 2008 ఆసియా కప్ లో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 14 సిక్సులతో రికార్డు నెలకొల్పాడు. తాజాగా.. ఆ రికార్డును అభిషేక్ అధిగమించడం ద్వారా గత 17ఏళ్లుగా చెక్కచెదరకుండా ఉన్న రికార్డును అధిగమించాడు.

ఈ జాబితాలో అభిషేక్ శర్మ (17 సిక్సులు), సనత్ జయసూర్య (14 సిక్సులు)లు కొట్టగా.. ఆ తరువాతి స్థానంలో రోహిత్ శర్మ (13), షాహిద్ అఫ్రిది (12 సిక్సులు), రెహ్మనుల్లా గుర్బాజ్ (12 సిక్సులు)లు బాదారు.