Asia Cup 2025: ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ విజయం.. సూపర్ ఓవర్‌లో తేలిన ఫలితం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది.

Courtesy @BCCI
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్ డ్రా గా ముగియడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఒక ఓవర్ లో 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 3 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. మొదటి బంతికే విజయం సాధించింది. హసరంగ వేసిన తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. మూడు పరుగులు తీశాడు. దాంతో లంకపై భారత్ గెలుపొందింది.
సూపర్ ఓవర్ లో భారత్ తరపున అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 5 బంతులు వేసి 2 వికెట్లు తీశాడు. శ్రీలంకను 2 పరుగులకే పరిమితం చేశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో భారత్ విక్టరీ కొట్టింది.
ఈ ఎడిషన్ లో భారత్ జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది. అన్ని మ్యాచులు గెలిచింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఫైనల్ లో పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది.
Also Read: భారత్, పాక్ ఫైనల్ కోసం బంగ్లాదేశ్ కి అన్యాయం?.. రెండు నెలల ముందే ఫిక్స్..!