IND vs PAK: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌ నక్వీ సంచలన కామెంట్స్‌.. క్రికెట్‌లోకి యుద్ధాన్ని లాగుతూ.. పైగా మోదీని ఏమన్నారంటే?

క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్‌ తిరిగి ఆ నిందను భారత్‌పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

IND vs PAK: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌ నక్వీ సంచలన కామెంట్స్‌.. క్రికెట్‌లోకి యుద్ధాన్ని లాగుతూ.. పైగా మోదీని ఏమన్నారంటే?

Mohsin Naqvi

Updated On : September 29, 2025 / 6:53 PM IST

IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు హాట్‌ టాపిక్‌గా నిలిచాయి.

ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నక్వీ ప్రొటోకాల్‌ను పాటించకుండా ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్‌కు తీసుకెళ్లడం, భారత్‌ కూడా ట్రోఫీని అందుకునేందుకు నిరాక‌రించడం వంటివి జరిగాయి. (IND vs PAK)

భారత అభిమానులు “భారత్ మాతా కీ జై” నినాదాలు చేశారు. పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోనే చాలాసేపు ఉండిపోయింది. ఇవేగాక అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇండియా మ్యాచ్‌ గెలవగానే ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. “క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం మాత్రం మళ్లీ అలాగే వచ్చింది.. భారత్‌ గెలుపొందింది. మన క్రికెటర్లకు అభినందనలు” అని అన్నారు.

మోదీ ట్వీట్‌పై నక్వీ ఎక్స్‌లో స్పందిస్తూ… “యుద్ధమే మీ గర్వానికి ప్రమాణమైతే, పాకిస్థాన్ చేతుల్లో మీరు అవమానకర పరాజయాలు ఎదుర్కొన్నారని చరిత్రలో ఇప్పటికే రాసి ఉంది. ఆ నిజాన్ని ఏ క్రికెట్ మ్యాచ్ కూడా మార్చలేదు. క్రీడల్లోకి యుద్ధాన్ని లాగడం నిరాశను బయటపెడుతుంది, క్రీడాస్ఫూర్తిని అవమానిస్తుంది” అని చెప్పుకొచ్చారు.

నక్వీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్‌ తిరిగి ఆ నిందను భారత్‌పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌ కూడా నక్వీనే అన్న విషయం తెలిసిందే.