AUS vs SA : చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ భారీ హిట్టర్.. 16 ఏళ్ల రికార్డు బ్రేక్.. దక్షిణాఫ్రికా పై ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు.

AUS vs SA 1st T20 Tim David Breaks Warner 16 year old record
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా పై ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో డేవిడ్ 52 బంతులు ఎదుర్కొన్నాడు. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అతడు దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు. 2009లో వార్నర్ దక్షిణాఫ్రికా పై ఓ టీ20 మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదగా.. తాజాగా డేవిడ్ 8 సిక్సర్లు కొట్టాడు.
ఓ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు వీరే..
టిమ్ డేవిడ్ – 8 సిక్సర్లు (10 ఆగస్టు 2025)
డేవిడ్ వార్నర్ – 6 సిక్సర్లు (11 జనవరి 2009)
డేవిడ్ హస్సీ – 6 సిక్సర్లు (27 మార్చి 2009)
మిచెల్ మార్ష్ – 6 సిక్సర్లు (1 సెప్టెంబర్ 2023)
ట్రావిస్ హెడ్ – 6 సిక్సర్లు (3 సెప్టెంబర్ 2023)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టిమ్ డేవిడ్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ కాకుండా కామెరూన్ గ్రీన్ (35) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ రెండు వికెట్లు తీశాడు. లుంగి ఎంగిడి, జార్జ్ లిండే, సెనూరన్ ముత్తుసామి లు తలా ఓ వికెట్ సాధించారు.
Shaheen Afridi : పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డ్..
అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. సఫారీ బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (71; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ విసెంచరీ బాదాడు. ట్రిస్టన్ స్టబ్స్ (37; 27 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్,బెన్ ద్వార్షుయిస్ చెరో మూడు వికెట్లు తీశారు. ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.
ఐపీఎల్ 2025 మెగావేలంలో ఆర్‌సీబీ టిమ్ డేవిడ్‌ను 3 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.