WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త విజ‌య ల‌క్ష్యం 444

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ను సొంతం చేసుకోవాలంటే టీమ్ఇండియా బ్యాట‌ర్లు శ్ర‌మించాల్సిందే. 270/8 స్కోరు వ‌ద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త విజ‌య ల‌క్ష్యం 444

Team India

WTC Final: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ను సొంతం చేసుకోవాలంటే టీమ్ఇండియా(Team India) బ్యాట‌ర్లు శ్ర‌మించాల్సిందే. 270/8 స్కోరు వ‌ద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో అలెక్స్ కేరీ(66 నాటౌట్‌) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా, మిచెల్ స్టార్క్ 41 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ ష‌మీ, ఉమేశ్ యాద‌వ్ చెరో రెండు, సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, టీమ్ ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 296 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 173 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్‌ను క‌లుపుకుని భార‌త్ ముందు 444 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. ఒక‌టిన్న‌ర రోజుల ఆట మిగిలి ఉంది. క‌నీసం డ్రా చేసుకోవాల‌న్నా టీమ్ఇండియా బ్యాట‌ర్లు 137 ఓవ‌ర్ల పాటు క్రీజులో నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది.

WTC Final 2023: బాలకృష్ణ డైలాగులు చెబుతూ అదరగొట్టేసిన స్టీవ్ స్మిత్.. వీడియో

147 ప‌రుగులు 4 వికెట్లు

123/4 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట‌ను ప్రారంభించింది. అయితే కొద్ది సేప‌టికే ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో ల‌బుషేన్‌(41) ఔట్ అయ్యాడు. దీంతో ధాటిగా ఆడాల‌న్న ఆసీస్ వ్యూహానికి కొద్దిగా బ్రేక్ ప‌డింది. అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్‌(25)లు ఆచితూచి ఆడారు. లంచ్‌కు అర‌గంట ముందు గ్రీన్‌ ను జ‌డేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ లంచ్ విరామానికి 6 వికెట్ల నష్టానికి 201తో నిలిచింది.

లంచ్ విరామం అనంత‌రం ఆసీస్ బ్యాట‌ర్లు ధాటిగా ఆడారు. ఈ క్ర‌మంలో అలెక్స్ కేరీ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. మ‌రో వైపు మిచెల్ స్టార్క్‌సైతం దూకుడుగా ఆడాడు. వీరిద్ద‌రు ఏడో వికెట్ వేగంగా 93 ప‌రుగులు జోడించారు. ఆ త‌రువాత వ‌చ్చిన క‌మిన్స్‌(5) ఆడే క్ర‌మంలో ఔట్ కావ‌డంతో 270 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వెంట‌నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భార‌త్ ముందు 444 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

Ravindra Jadeja: 93 సెక‌న్ల‌లోనే ఓవర్‌ పూర్తి.. బిష‌న్ సింగ్ బేడీ రికార్డు బ్రేక్