World Cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్?

అక్టోబర్ 5 నుంచి పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది.

World Cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్?

Ashton Agar

Australia Player Ashton Agar: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో సత్తాచాటేందుకు ఆయా జట్లు సన్నద్ధమవుతున్నాయి. మరోసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచేందుకు ఆస్ట్రేలియా జట్టు కసరత్తు చేస్తోంది. అయితే, ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లను గాయల బెడద వేదిస్తోంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టుకు వన్డే ప్రపంచ కప్‌కు ముందే బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ అష్టన్ అగర్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి దూరం కానున్నట్లు సమాచారం. అగన్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్‌కు గాయమైంది. అతను గాయం నుంచి కోలుకోవడానికి మరో నాలుగు వారాలు పడుతుందని తెలుస్తోంది.

Ind vs Aus 3rd ODI : ఆఖ‌రి వ‌న్డేలో ఓడిన టీమ్ఇండియా.. అయినా సిరీస్ మ‌న‌దే

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20కి దూరమైన తరువాత అష్టన్ అగర్ ఇండియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, వన్డే వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టులో 29ఏళ్ల అష్టన్ అగర్ పేరు ఉంది. ఆడమ్ జంపాతో పాటు స్పిన్ ద్వయంలో అగర్ ఉన్నాడు. అతను ఆస్ట్రేలియా తరపున 22 వన్డే మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు. ఇదిలాఉంటే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కోసం 15 మందిని ఈరోజు పైనల్ చేస్తుందని సమాచారం. అగర్ స్థానంలో యువ ప్లేయర్ తన్వీర్ సంఘా జట్టులోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Ind vs Aus 3rd ODI : లబుషేన్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

అక్టోబర్ 5 నుంచి పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. మెగా టోర్నీకి అగర్ దూరమైతే ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు.