AUS-W vs IND-W : భారత్‌కు షాక్.. తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం..
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో మొదలుపెట్టింది

Australia women team beat Indian team by 5 wickets in First ODI Match
AUS-W vs IND-W : ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో మొదలుపెట్టింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఫలితంగా ఆసీస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భారత జట్టు నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్లు జార్జియా వోల్ (46నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్ (35; 29 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ మూడు వికెట్లు తీసింది. ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టింది.
IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ శర్మ భారీ త్యాగం.. ఇప్పుడెలా..!
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న మెగాన్ స్కట్ (5/19) ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (23; 42 బంతుల్లో 1 ఫోర్) టాప్ స్కోర్. హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
ప్రియా పునియా (3), స్మృతీ మంధాన (8), దీప్తి శర్మ (1), సైమా ఠాకూర్ (4) టిటాస్ సధు (2) విఫలం కావడంతో భారత్ తక్కువ పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో స్కట్ ఐదు వికెట్లు తీసింది. కిమ్ గార్త్, గార్డెనర్, సదర్లాండ్, అలానా కింగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Syed mushtaq ali trophy : 20 ఓవర్లలో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లో బరోడా ప్రపంచ రికార్డు..
ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే బ్రిస్బేన్ వేదికగానే డిసెంబర్ 8న జరగనుంది.