IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ శర్మ భారీ త్యాగం.. ఇప్పుడెలా..!
రెండో టెస్టులోనూ రాహుల్ ఓపెనర్‌గా రావాలని, రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో వస్తే బాగుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వాటికి రోహిత్ శర్మ ముగింపు పలికాడు.

Rohit Sharma Makes Big Sacrifice Ahead Of 2nd Test Against Australia
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా బుమ్రా నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ విజయం సాధించింది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అయితే.. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. దీంతో రెండో టెస్టులోనూ రాహుల్ ఓపెనర్‌గా రావాలని, రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో వస్తే బాగుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వాటికి రోహిత్ శర్మ ముగింపు పలికాడు.
పింక్ బాల్ టెస్టుకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వస్తాడని స్పష్టం చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో తాను ఆడతానని చెప్పుకొచ్చాడు. అయితే.. తనకు ఇది అంత ఈజీ కాదన్నాడు. కానీ జట్టుకు ఇదే మంచిదన్నాడు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా సరే విజయం సాధించేందుకేనని తెలిపాడు.
Syed mushtaq ali trophy : 20 ఓవర్లలో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లో బరోడా ప్రపంచ రికార్డు..
తొలి టెస్టులో యశస్వి, కేఎల్ రాహుల్‌లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. రాహుల్ బ్యాటింగ్ చూడడం బాగుందని, పెర్త్ వంటి పిచ్ పై నిలకడగా ఆడడం తేలికైన విషయం కాదన్నాడు. అందుకనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అనిపించిందన్నాడు.
అయితే.. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేమన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నాడు. ఇక కెప్టెన్‌గా తాను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది జట్టుకు ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటానని రోహిత్ శర్మ అన్నాడు.
IND vs AUS : యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ పై తొలిసారి స్పందించిన మిచెల్ స్టార్క్..
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్ మొదట్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడు. అయితే.. నిలకడగా ఆడకపోవడంతో అతడి స్థానం సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉండేది. ఎప్పుడైతే అతడు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడో అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని హిట్‌మ్యాన్ వదులు కున్నాడు. దీంతో అతడు మిడిల్ ఆర్డర్‌లో ఎలా ఆడుతాడనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
🚨 KL RAHUL TO OPEN IN THE PINK BALL TEST…!!! 🚨
– Rohit Sharma confirms he’ll bat in the middle order. pic.twitter.com/PtVXDWtUQS
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024