Team India: మూడో టీ20లో అవేష్ ఖాన్ అరంగేట్రం? Probable Playing XI!
భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా..

Wi Ind
Team India : భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా.. రెండో టీ20లో గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. రాత్రి 7 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది రోహిత్ సేన.
అవేష్ ఖాన్ అరంగేట్రం:
తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్లు వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్ గాయపడగా.. ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఉండవచ్చు.
దీపక్ హుడాకు ఛాన్స్:
తొలి టీ20లో టాస్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాడిని పక్కనబెట్టడం సులువు కాదు. అయితే మిడిల్ ఆర్డర్‌లో కొన్ని ఓవర్లు కూడా బౌలింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ కావాలి కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో వెంకటేష్ అయ్యర్‌కు బదులుగా దీపక్ హుడాకు అవకాశం ఇవ్వవచ్చు అని అన్నారు. దీపక్ లోయర్ ఆర్డర్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
టీమ్ ఇండియా Probable Playing XI – రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (Wk), శ్రేయాస్ అయ్యర్/దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్వర్ ఖాన్.